X
ఫస్ట్ డే ఫస్ట్ షో
Comedy | Romance | 02 Sep 2022 | U/A | 119 Mins
Telugu

ఫస్ట్ డే ఫస్ట్ షో స్టోరీ

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కామెడీ, డ్రామా, రొమాంటిక్  ఎంటర్టైనర్ చిత్రం శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మించారు. కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు.


కథ

నారాయణఖేడ్‌కు చెందిన శ్రీను (శ్రీకాంత్ రెడ్డి) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని. అదే గ్రామానికి చెందిన లయ (సంచిత బాషు) కూడా పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం. పవన్ కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే అంతే ఇష్టంగా ప్రేమించుకొంటారు. అయితే ఖుషి సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలని శ్రీనును లయ కోరుతుంది. దాంతో ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం టికెట్ల వేట శ్రీను ప్రారంభిస్తాడు. లయ కోసం ఖుషి సినిమా టికెట్ సంపాదించడానికి శ్రీను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రియురాలి మనసు గెలుచుకోవడానికి ఎలాంటి అవస్థలు పడ్డాడు? తన అభిమాన నటుడి సినిమా తొలి రోజు తొలి ఆట చూడటానికి ఎలాంటి అవమానాలు భరించాడు. చివరకు ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ సంపాదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే First day first show కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+