గాలి సంపత్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనీష్ వహించారు. నిర్మాత ఎస్ కృష్ణ నిర్మించారు. సంగీతం అచ్చు రాజమణి అందించారు.
కథ
రేడియో ఆర్టిస్టు గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్)కు నాటకాలు అంటే చెప్పలేనంత ఇష్టం. ఓ యాక్సిడెంట్‌లో తనకు, తన జీవితానికి బలంగా మారిన గొంతును కోల్పోయి మూగవాడిగా గాలి సంపత్ మారిపోతారు. భార్య అకాల మరణం చెందడంతో కొడుకు సూరి (శ్రీ విష్ణు) కోసం జీవిస్తుంటాడు. అరకులో ఓ ట్రక్కు కొనుక్కొని జీవితం గడిపేయాలనే ఆలోచనలో సూరి ఉంటారు. ఈ క్రమంలో అదే ఊరిలోని సర్పంచ్ కూతురు పాప (లవ్లీ సింగ్)తో ప్రేమలో పడుతాడు. అయితే తండ్రి కారణంగా తన పెళ్లికి అడ్డంకులు ఏర్పడటంతో సూరి మనస్తాపానికి గురి అవుతారు. తండ్రిపై ఆగ్రహం చెంది ఇంటి నుంచి వెళ్లిపోమ్మని అరిచేస్తాడు. కొడుకు తీరుతో మనోవేదన గురైన గాలి సంపత్ ప్రమాదవశాత్తూ ఇంటి ముందు ఉన్న ఖాళీ బావిలో పడుతాడు. రేడియో మామయ్య పేరు సంపాదించుకొన్న గాలి సంపత్ ఎలా మూగవాడిగా మారిపోయారు? తన కుమారుడు సూరిని ఎందుకు ప్రాణంగా చూసుకొంటాడు. గాలి సంపత్ కారణంగా సూరి ప్రేమ, పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. బావిలో పడిన గాలి సంపత్ పరిస్థితి ఏమైంది? తండ్రిపై సూరికి ఏర్పడిన అపోహ ఎలా తొలిగిపోయింది? బావిలో పడిన గాలి సంపత్ పరిస్థితి ఏమైంది? పాపతో ప్రేమను సూరి గెలుచుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే గాలి సంపత్ సినిమా కథ.