గాలిపటం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే మాటలు :సంపత్ నంది నిర్వహించారు మరియు దర్శకత్వం: నవీన్ గాంధి, నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, నిర్మించారు. సంగీతం బీమ్స్ స్వరాలు అందించారు.
కథ
తాము బెస్ట్ కపుల్ గా సెలక్ట్ అయిన సందర్బంగా కార్తీక్(ఆది),శ్వేత(ఎరికా ఫెర్నాండెజ్)లు సెలబ్రేట్ చేసుకుంటూంటారు. ఆ సందర్బంలో ఇద్దరూ బాగా తాగి చిన్న మాట తేడా తో తమ గతాలను, గతం తాలూకు 'ఆ' అనుభవాలను బయిటపెట్టుకుంటారు. ఆ రాత్రి బాగా ఆలోచించి...తమ మధ్యన ప్రేమ లేనప్పుడు పెద్దలుకోసం కలిసి ఉండటం అనవసరమని నిర్ణయించుకుని విడిపోవటం ఉత్తమం అని తీర్మానించుకుని విడాకులుకు అప్లై చేసి, తమ పాత ప్రేమలకు ఆహ్వానం పలుకుతారు. ఆ పైన ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.