గేమ్ ఓవర్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రధాన పాత్రలో తాప్సీ పన్ను, వినోదిని వైద్య నాథన్, అనీష్ కురువిల్ల, సంచన నటజరాజన్, రమ్య సుబ్రమణియన్, పార్వతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశ్విన్ శరవణన్ వహించారు మరియు నిర్మాత ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రోన్ ఏతాన్ యోహాన్ అందించారు.
కథ
అమృత(సంజన నటరాజన్) అనే అమ్మాయి కిరాతకమైన హత్యతో సినిమా మొదలైంది. ఒక ఉన్మాది ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వారి తల నరికి, పెట్రోలు పోసి తగలబెట్టి అత్యంత దారుణంగా హత్యలు చేస్తుంటాడు. కట్ చేస్తే... సినిమా కథ స్వప్న(తాప్సీ పన్ను) అనే వీడియో గేమ్ డిజైనర్ జీవితం వైపు టర్న్ అవుతుంది. న్యూ ఇయర్ రాత్రి తనపై జరిగిన రేప్ సంఘటనతో మానసికంగా కృంగిపోయిన ఆమె చీకటిని సహించలేని రుగ్మతతో బాధపడుతూ ఉంటుంది.
డిసెంబర్ 31న స్వప్న తన చేతిపై టాటూ వేయించుకుంటుంది. అప్పటి నుంచి తన జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దాన్ని రిమూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇంతకీ టాటూ వెనక కథేంటి? అమృతకు, సప్న చేతిపై ఉన్న టాటూకు లింకేంటి? అనే విషయాన్ని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో వివరించే ప్రయత్నం చేశారు.