జార్జ్ రెడ్డి సినిమా జార్జ్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు . ఈ సినిమాలో శాండీ, ముస్కాన్ ఖూబ్ చందాని, దేవికా దప్తార్డర్, సంజయ్ రెడ్డి, మనోజ్ నందం, సత్యదేవ్ కంచరణ్, శతృ, అభయ్ బెతిగంటి, దయా కె, వినయ్ వర్మ, శ్రీనివాస్ పోకలే తదితరులు నటించారు. ఈ సినిమాని దళం దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాతలు దాము రెడ్డి, అప్పి రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి, హర్షవర్దన్ రామేశ్వర్ అందించారు.
కథ
కేరళలో పుట్టి పెరిగిన జార్జ్‌రెడ్డి బాల్యం నుంచే అవేశంతో సమస్యలపై స్పందిస్తుంటాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన అతడికి కొన్ని పరిస్థితులు సామాజిక కోణంలో ఆలోచించేలా చేస్తాయి. యూనివర్సిటీలో అమ్మాయిలపై అఘాయిత్యాలతో ప్రారంభమైన పోరాటం, విద్యార్థుల భోజన వసతులు, కులం వివక్ష వరకు సాగి.. ఆపై విద్యార్థి రాజకీయాల వైపు నడిచేలా చేస్తాయి. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు జార్జిరెడ్డి దేశవ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరిచేందుకు కంకణం కట్టుకొంటాడు. రైతుల ఆత్మహత్యల ఆపే క్రమంలో జార్జిరెడ్డికి ఎదురైన సమస్యలేంటి? విద్యార్థి రాజకీయాల్లో జార్జిరెడ్డి తన పాత్రను ఎలా పోషించారు? ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న దుష్టశక్తులను ఏరిపారేసే క్రమంలో ప్రత్యర్థుల మానసిక, శారీరక దాడులను ఎలా ఎదుర్కొన్నాడు? బొంబాయి యూనివర్సిటీలో వచ్చిన ఉన్నత ఉద్యోగాన్ని ఎందుకు వదులుకొన్నాడు? ఉస్మానియాలో పాతబస్తీ మాఫియాను ఎదురించే క్రమంలో ఎలాంటి ధైరసాహసాలను చూపాడు? ఎలాంటి మోసానికి గురై జార్జిరెడ్డి తన ప్రాణాలను వదులుకోవడానికి తెగించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే జార్జిరెడ్డి సినిమా కథ.