X
తెలుగు » సినిమాలు » జార్జ్ రెడ్డి
జార్జ్ రెడ్డి

జార్జ్ రెడ్డి

Biography | 22 Nov 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

జార్జ్ రెడ్డి స్టోరీ

జార్జ్ రెడ్డి  సినిమా జార్జ్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు . ఈ సినిమాలో శాండీ, ముస్కాన్ ఖూబ్ చందాని, దేవికా దప్తార్డర్,  సంజయ్ రెడ్డి, మనోజ్ నందం, సత్యదేవ్ కంచరణ్, శతృ, అభయ్ బెతిగంటి, దయా కె, వినయ్ వర్మ, శ్రీనివాస్ పోకలే తదితరులు నటించారు. ఈ సినిమాని దళం దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాతలు దాము రెడ్డి, అప్పి రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి, హర్షవర్దన్ రామేశ్వర్ అందించారు.   కథ  కేరళలో పుట్టి పెరిగిన జార్జ్‌రెడ్డి బాల్యం నుంచే అవేశంతో సమస్యలపై స్పందిస్తుంటాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన అతడికి కొన్ని పరిస్థితులు సామాజిక కోణంలో ఆలోచించేలా చేస్తాయి. యూనివర్సిటీలో అమ్మాయిలపై అఘాయిత్యాలతో ప్రారంభమైన పోరాటం, విద్యార్థుల భోజన వసతులు, కులం వివక్ష వరకు సాగి.. ఆపై విద్యార్థి రాజకీయాల వైపు నడిచేలా చేస్తాయి. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు జార్జిరెడ్డి దేశవ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను చైతన్య పరిచేందుకు కంకణం కట్టుకొంటాడు. రైతుల ఆత్మహత్యల ఆపే క్రమంలో జార్జిరెడ్డికి ఎదురైన సమస్యలేంటి? విద్యార్థి రాజకీయాల్లో జార్జిరెడ్డి తన పాత్రను ఎలా పోషించారు? ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న దుష్టశక్తులను ఏరిపారేసే క్రమంలో ప్రత్యర్థుల మానసిక, శారీరక దాడులను ఎలా ఎదుర్కొన్నాడు? బొంబాయి యూనివర్సిటీలో వచ్చిన ఉన్నత ఉద్యోగాన్ని ఎందుకు వదులుకొన్నాడు? ఉస్మానియాలో పాతబస్తీ మాఫియాను ఎదురించే క్రమంలో ఎలాంటి ధైరసాహసాలను చూపాడు? ఎలాంటి మోసానికి గురై జార్జిరెడ్డి తన ప్రాణాలను వదులుకోవడానికి తెగించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే జార్జిరెడ్డి సినిమా కథ.
Read More

జార్జ్ రెడ్డి కాస్ట్ & క్రూ

జార్జ్ రెడ్డి సిబ్బంది సమాచారం

దర్శకత్వం జీవన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ సుధాకర్ రెడ్డి యాకంటి
సంపాదకుడు NA
సంగీతం సురేష్ బొబ్బిలి, హర్షవర్దన్ రామేశ్వర్
నిర్మాత అప్పి రెడ్డి, దాము రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జార్జ్ రెడ్డి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
జాతీయ స్థాయి ఐకాన్‌గా నిలిచిన జార్జిరెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో అన్ని రకాలు అంశాలు మెప్పించే విధంగా ఉన్నాయి. కథ, కథనాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. సాంకేతిక అంశాలు సినిమాను పూర్తిగా నిలబెట్టాయని చెప్పవచ్చు. స్ఫూర్తిని రగిలించే సినిమాలను ఇష్టపడే వారికి జార్జిరెడ్డి తప్పక నచ్చుతుంది. ఇటీవల వచ్చిన తెలుగు బయోపిక్స్‌లో ఉత్తమంగా నిలిచిన వాటిలో ఒకటని అని చెప్పవచ్చు. యూత్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే కమర్షియల్‌గా మెరుగైన ఫలితాలను అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

జార్జ్ రెడ్డి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జార్జ్ రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+