గని (2022)(U/A)
Release date
08 Apr 2022
genre
గని స్టోరి
గని సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. థమన్ సంగీతం అందించారు.
కథ
విక్రమాదిత్య అనే జాతీయ స్థాయి బాక్సర్ కుమారుడు గని ( వరుణ్ తేజ్). తండ్రిని స్పూర్తిగా తీసుకొని జాతీయ స్థాయి బాక్సర్ కావాలని చిన్నతనం నుంచే కలలు కంటాడు. కానీ జాతీయ పోటీలో విక్రమాదిత్యకు ఎదురైన ఓ సంఘటన కారణంగా గని కుటుంబానికి సమాజం నుంచి చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వస్తుంది. దాంతో బాక్సింగ్ క్రీడ జోలికి వెళ్లవద్దని బాల్యంలోనే గని చేత తల్లి ఒట్టు వేయించుకొంటుంది. తన తండ్రి విక్రమాదిత్యకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దేశం మొత్తం వ్యతిరేకించే విధంగా విక్రమాదిత్య ఏం చేశాడు? తన తండ్రిపై గని ఎందుకు కోపం పెంచుకోవాల్సి వచ్చింది? తల్లికి ఇచ్చిన మాట మేరకు బాక్సింగ్ వదిలేశాడా? గని తండ్రికి జరిగిన మోసం ఏమిటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు)పై గని ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. బాక్సింగ్ క్రీడతో మాయ (సాయి మంజ్రేకర్)తో గని ప్రేమ కథ ఎలా నడించింది. గని కథలో నేషనల్ చాంఫియన్ విజయేంద్ర సిన్హా (సునీల్ శెట్టి) పాత్ర ఏమిటి? గనిని జాతీయ స్థాయి బాక్సర్‌గా తీర్చి దిద్దేందుకు విజయేంద్ర సిన్హా ఎందుకు కంకణం కట్టుకొన్నాడు? కథలో ఇర్ఫాన్ ఖాన్ (అంబరీష్), యూసఫ్ ఖాన్ (భరత్ రెడ్డి) పాత్రలు ఏమిటి?
**Note:Hey! Would you like to share the story of the movie గని with us? Please send it to us ([email protected]).