గల్లీ రౌడీ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీ సింహా, హర్ష చెముడు, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, షకలక శంకర్, మైమ్ గోపి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి వహించారు. నిర్మాత ఎమ్ ఎమ్ వి శస్త్యనారాయణ నిర్మించారు. సంగీతం చౌరస్తా రామ్ అందించారు.
కథ
విశాఖపట్నంలో రౌడీ కుటుంబానికి చెందిన వాసు (సందీప్ కిషన్) చిన్నతనంలో చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. కానీ తన తాత (నాగినీడు), ఆయన సహాయకుడు (పోసాని మురళీ కష్ణ) వాసుని చదువు మాన్పించి రౌడీగా తయారు చేయాలనుకొంటారు. తాత కోరిక మేరకు అయిష్టంగానే రౌడీగా వాసు మారుతాడు. ఈ క్రమంలో పోలీస్ ఇన్స్‌పెక్టర్ పట్టపగలు వెంకటరావు (రాజేంద్ర ప్రసాద్) కూతురు సాహితి (నేహా శెట్టి)తో వాసు ప్రేమలో పడుతాడు. వెంకటరావు భూమిని బైరాగి (మైమ్ గోపి) అనే పేరు మోసిన రౌడీ కబ్జా చేస్తాడు. దాంతో వెంకటరావు కుటుంబం వాసుతో కలిసి బైరాగిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కిడ్నాప్ చేసే సమయంలో బైరాగి హత్యకు గురవుతాడు.