గుండె జారి గల్లంతయ్యిందే సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, నిత్య మీనన్, ఇషా తల్వార్, గుత్తా జ్వాల, అలీ, తాగుబోతు రమేష్, ఆహుతి ప్రసాద్, రవిబాబు, సుధ, దువ్వాసి మోహన్, మధునందా తదితరులు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండా నిర్వహించారు మరియు నిర్మాత: నిఖితారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
సాప్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన కార్తీక్ (నితిన్) తొలిచూపులోనే చిన్న పాటి పరిచయం కూడా లేకుండా శ్రుతి(ఇషా తల్వార్) తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె ఫోన్ నెంబర్ ట్రేస్ చేయటంలో పొరపాటు జరిగి శ్రావణి(నిత్యమీనన్)కి కనెక్టు అవుతాడు. శ్రావణి సున్నిత మనస్తత్వమున్న యువతి. తన కోసమే పుట్టిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనేదే ఆమె ఆలోచన. శ్రావణినినే శ్రుతి అనుకుని కార్తీక్ లైన్ లో పెట్టడానకి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో శ్రావణితో మానసికంగా అనుబంధం పెంచుకుంటాడు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో అసలు నిజం తెలుస్తుంది. శ్రుతి వేరు.. తను ఫోన్ లో ప్రేమించే అమ్మాయి వేరు అని అర్దం అవుతుంది. అప్పుడు శ్రావణి ఏ నిర్ణయం తీసుకుంది. కార్తీక్ ఎవరితో కలిసి జీవితం పంచుకొన్నాడు? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.