హలో మీరా సినిమా డ్రామా, సైకోలాజికల్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కాకర్ల శ్రీనివాస్ వహించారు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై పద్మ కాకర్ల నిర్మించారు. సంగీతం ఎస్ చిన్నా అందించారు.
రిలీజ్ డేట్
ఈ సినిమాను ఏప్రిల్ 21, 2023 తేదీన విడుదల చేసారు.
కథ
హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే మీరా (గార్గేయి ఎల్లా ప్రగడ) సొంత ఊరు విజయవాడలో పెళ్లి కుదురుతుంది. పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్న సమయంలో హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీరా మాజీ బాయ్‌ఫ్రెండ్ సుధీర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో సూసైడ్ నోట్‌లో మీరా పేరు ఉండటంతో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కాల్ చేస్తాడు? కేసు నమోదు చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని పోలీసులు ఆదేశిస్తారు. దాంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలు దేరిన తర్వాత మీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మీరా బాయ్‌ఫ్రెండ్ సుధీర్ ఎందుకు సూసైడ్ ప్రయత్నం చేశారు? హైదరాబాద్ పోలీసులు పిలిచిన నేపథ్యంలో మీరా ఎలాంటి సంఘర్షణకు లోనైంది? మీరా తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పిందా? పెళ్లికి ముందు మీరాకు ఎదురైన పరిస్థితిపై తల్లిదండ్రులు ఎలా స్పందించారు? సూసైడ్ అటెంప్ట్ తర్వాత సుధీర్ పరిస్థితి ఏమిటి? చివరకు మీరా పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే హలో మీరా సినిమా