X
హిదింబ
Action | 20 Jul 2023 | A | 136 Mins
Telugu

హిదింబ స్టోరీ

హిదింబ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశ్విన్ బాబు, నందిత శ్వేత, రఘు కుంచె, రాజివ్ కనకాల, సంజై స్వరూఫ్, శ్రీనివాస రెడ్డి, సుభలేఖ సుదాకర్, విద్యుల్లేఖ రమన్, దీప్తి నల్లమోతు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనీల్ కనీగంటి వహించారు. నిర్మాత శ్రీదర్ గంగపట్నం నిర్మించారు. సంగీతం వికాష్ బడిషా అందించారు. 

కథ
నగరంలో అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయిలు అదృశ్యం కావడం ప్రభుత్వానికి, పోలీస్ విభాగానికి సవాల్‌గా నిలుస్తుంది. అమ్మాయిల మిస్సింగ్ సంచలనంగా మారడమే కాకుండా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కేరళ నుంచి పోలీస్ ఆఫీసర్ ఆద్య (నందితా శ్వేత)ను పిలిపిస్తారు. అప్పటికే మిస్పింగ్ కేసును పరిశీలిస్తున్న అభయ్ (అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య దర్యాప్తు చేపడుతారు. అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారంలో కాలాబండా అనే ప్రాంతం ఎందుకు అనుమానాస్పదంగా మారింది? కాలబండా అనే ప్రాంతంపై అధిపత్యం కొనసాగిస్తున్న బోయా (రాజీవ్ పిళ్లై)కు ఎలాంటి సంబంధం ఉంది? పోలీస్ ఆఫీసర్ (రఘు కుంచె) ఎందుకు కేసును పక్కదారి పట్టించేందుకు చూశాడు? డీజీపీ (సంజయ్ స్వరూప్) బోయాను రక్షించేందుకు ప్రయత్నించారు? రాష్ట్ర సీఎం (శుభలేఖ సుధాకర్) మిస్సింగ్ కేసును పర్సనల్‌గా ఎందుకు తీసుకొన్నారు? దర్యాప్తు చేపట్టడానికి ముందే అభయ్, ఆద్య అప్పటికే ఎందుకు బ్రేకప్ జరిగింది? నరహంతకులైన గిరిజన తెగ హిడింబకు కథ ఏమిటి? అమ్మాయిల మిస్సింగ్‌కు హిడింబ తెగకు ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయిల మిస్సింగ్ కేసును అభయ్, ఆద్య ఎలా ఛేదించారనే ప్రశ్నలకు సమాధానమే హిడింబ సినిమా.

రీలీజ్ 
హిదింబ సినిమా 2023 జూలై 23న రిలీజ్ అయ్యింది. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+