హిట్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాలో విశ్వక్ సేన్, మురళీ శర్మ, బ్రహ్మాజి, భాణుచందర్, హరి తేజ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో శైలేశ్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. హీరో నాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
కథ
డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గాయని మంగ్లీ, కెపీ ఎన్ చౌహాన్, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కెపీ ఎన్ చౌహాన్ వహించారు. అంగోథ్ రాజు నాయక్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బోలే సవాలి అందించారు.
గతం వెంటాడుతుండటంతో విక్రమ్ (విశ్వక్‌సేన్).. ఓ వ్యాధితో బాధపడుతుంటాడు. అతను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని వదిలేయాలని డాక్టర్, ప్రేయసి నేహా (రుహాని శర్మ) సలహా ఇస్తారు. కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ప్రీతి (సాహితి) అనే అమ్మాయి మిస్ అవుతుంది. వెను వెంటనే నేహా కూడా మిస్ అవుతుంది. విక్రమ్‌ను వెంటాడే ఆ గతమేంటి? ప్రీతిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఆపై ఎందుకు హత్య చేస్తారు? నేహా అదృశ్యం వెనుకున్నది ఎవరు? ప్రీతి-నేహాల కథ వెనుకున్నది ఎవరు? ఈ కథలో ఎస్సై ఇబ్రహీం (మురళీ శర్మ), స్వప్న (నవీనా రెడ్డి), శీలా (హరితేజ), అభిలాష్ (శ్రీనాత్ మాగంటి), రోహిత్ (చైతన్య సగిరాజు), ఫాహద్ (రవితేజ) ఎవరు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే HIT.