twitter

    ఇచ్చట వాహనములు నిలుపరాదు స్టోరి

    ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా థ్రిల్లర్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్,  ఐశ్వర్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, నిఖిల్, కైలాస, కృష్ణచైతన్య తదితరలు నటించారు. ఎస్‌ దర్శన్‌ దర్శకత్వం దర్శకత్వం వహించారు.  ఏఐ స్టూడియోస్‌, శాస్త్రా మూవీస్‌ పతాకాలపై రవి శంకర్‌ శాస్త్రి, హరీష్‌ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రఫీని అందించారు. 

    కథ
    డిజైన్ స్టూడియోలో అర్కిటెక్ట్‌గా పనిచేసే అరుణ్ (సుశాంత్) అదే కంపెనీలో పనిచేసే మీనాక్షి (మీనాక్షి చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. మీనాక్షి సోదరుడు నర్సింగ్ యాదవ్ (వెంకట్) ఓ కాలనీలో చిన్నపాటి లీడర్‌గా ఉంటారు. అదే ఏరియాలో మీనాక్షిని కలువడానికి వెళ్లిన అరుణ్ ఓ చోట నో పార్కింగ్ బోర్డు ఉన్న ప్రాంతంలో బైక్ పార్క్ చేస్తాడు. ఆ సమయంలోనే టెలివిజన్ నటి హత్య జరుగడం, ఆ హత్యా నేరం అరుణ్‌పై పడటం జరుగుతుంది. టెలివిజన్ నటి హత్య ఎందుకు జరుగుతుంది? ఆ నేరం అరుణ్‌పైనే ఎందుకు పడింది. నటి హత్యకు కారణం ఎవరు? నటిని ఎందుకు హత్య చేశారు? అరుణ్‌ను ఈ కేసు నుంచి బయట పడేసేందుకు వచ్చిన పులి (ప్రియదర్శి) కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? ఈ హత్యా నేరం నుంచి అరుణ్ బయటపడ్డారా? మీనాక్షి, అరుణ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఇచ్చట వాహనములు నిలుపరాదు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X