ఇందువదన సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వరువరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్త తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్ ఎస్ ఆర్ వహించారు. మాదవి ఆదుర్తి నిర్మించారు. శివ కాకాని స్వరాలు అందించారు.
కథ
ఇందు హత్యకు గురైన తర్వాత వాసు పరిస్థితి ఏమిటి? ఇందు హత్యకు గురైన తర్వాత వాసు తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం ఏమిటి? ఇందును ఎవరు హత్య చేశారు? హత్యకు గురైన తర్వాత ఇందు తన ప్రత్యర్థులపై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నది. ఇంకా ఈ కథలో ఆలీ, నాగినీడు, సురేఖవాణి, మహేష్ విట్టా పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఇందువదన సినిమా కథ. ఇందుపై దాడి, ఫారెస్ట్‌లో మాఫియా ఎటాక్ లాంటి అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. ఇందుగా ఫర్నాజ్ శెట్టి అందం, అభినయం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. ఆలీ ఎంట్రీతో వినోదం మరింత ఆకట్టుకొనేలా ఉంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా సాగడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివర్లో వరుణ్ సందేశ్‌కు సంబంధించిన ట్విస్ట్ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది.