ఇట్స్ మై లవ్ స్టోరి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్ కృష్ణ, నిఖిత నారాయణ్, జయసుధ, శరత్ బాబు, కాశీ విశ్వనాథ్, ప్రగతి, తాగు బోతు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మధుర శ్రీధర్ నిర్వహించారు మరియు నిర్మాత మున్నా వెంకట కృష్ణారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌశ్యప్ స్వరాలు సమకుర్చారు.
కథ
వీడియో గేమ్ డెవలపర్ గా పని చేస్తున్న అర్జున్( అరవింద్ కృష్ణ) హైదరాబాద్లో తన సొంత ప్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ వస్తుంది వందన(నిఖిత నారాయణ్). వందనకు, అర్జున్ కు అనుకోకుండా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా ఆపై ప్రేమగా మారుతుంది. హాస్టల్ లో ఉంటున్న వందనకు ఒక చేదు అనుభవం ఎదురు కావడంతో అర్జున్ తో కలిసి అతని ప్లాట్ లో ఉంటుంది. ఆ బంధాన్ని వందన తల్లి దండ్రులు(జయసుధ, శరత్ బాబు) తప్పు బడతారు. ఆ పైన ఏం జరింగది? అనేది మిగిలిన కథ.