జాదూగాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, సొనరిక భడోరియా, కోటా శ్రీనివాస్ రావు, శ్రీనివస్ రెడ్డి, ప్రిద్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అశిస్, ప్రభాస్, రవి కలే తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం యోగేష్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత వివిఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహతి స్వరాలు సమకుర్చుతున్నారు.
కథ
కోటి రూపాయలు సంపాదించిన తర్వాత మళ్లీ ఊళ్లో అడుగు పెడతానని పాలమూరులో జులాయిగా తిరిగే కృష్ణ(నాగ శౌర్య) ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా కోటి రూపాయలు సంపాదించాలని హైదరాబాద్ వస్తాడు. తొలుత బ్యాంక్ లోన్లు రికవరీ చేసే పని మొదలు పెడతాడు. నర్సు పార్వతితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రౌడీ శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) కంట్లో పడతాడు. అతని సత్తా చూసి తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. శ్రీశైలం కేంద్ర మంత్రి జగదీష్ నాయుడు(కోట)కు రైట్ హ్యాండ్. శ్రీశైలం ద్వారా జగదీస్ నాయుడు కోట్ల రూపాయల డీల్స్ నడుపుతుంటాడు. ఓసారి కృష్ణను అతనికి తెలియకుండా 2వేల కోట్ల పెద్ద డీల్ లో ఇరికిస్తాడు శ్రీశైలం. తర్వాత కృష్ణ ఇబ్బందుల్లో పడతాడు....ఈ నేపథ్యంలో కృష్ణ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెరపై చూడాల్సిందే.