జగమే తంత్రం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరాసన్, బాబా భాస్కర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ సుబ్బరాజ్ వహించారు. నిర్మాతలు ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర నిర్మించారు. మ్యూజిక్ సంతోష్ నారాయణన్ అందించారు.
కథ
తమిళనాడులోని మధురై ప్రాంతంలో గొడవలు, హత్యలతో కాలం వెళ్లదీసే యువకుడు సురులీ (ధనుష్). హత్యలకు పాల్పడుతున్న క్రమంలో అతడి ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో ఓ నెల రోజులపాటు ఎక్కడైనా తలదాచుకోవాలని ఊరి పెద్దలు సూచిస్తారు. ఆ సమయంలో బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ శివదాసుకు వ్యతిరేకంగా పనిచేయడానికి కిరాయి గుండాగా లండన్‌కు వెళ్లే అవకాశం సురులీకి లభిస్తుంది. అక్కడ ఓ సింగర్ అటీలా (ఐశ్వర్య లక్ష్మీ)ను చూసి తొలి పరిచయంలోనే ప్రేమలో పడిపోతాడు. బ్రిటన్‌లో అడుగుపెట్టిన తన బాస్ పీటర్ కోసం సురులీ ఏం చేశాడు. గ్యాంగ్‌స్టర్‌గా శివదాసును ఎదుర్కోవడానికి పీటర్‌కు ఎలాంటి సలహాలు ఇచ్చారు. శివదాస్ ఎలాంటి పరిస్థితుల్లో మరణిస్తాడు? శివదాస్ మరణం తర్వాత సురులీ ఎందుకు పశ్చాత్తాపం పడుతాడు. తనని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సురులీని అటీలా చంపాలని ఎందుకు కుట్ర పన్నుతుంది? తనను చంపడానికి ప్రయత్నించిన అటీలాను ఎందుకు క్షమించాడు? తన బాస్ పీటర్‌కు సురులీ ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానమే జగమే తంత్రం మూవీ కథ.