జక్కన్న సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సునిల్, మన్నార చోప్రా, కబీర్ దుహాన్ సింగ్, సప్తగిరి, పోసాని కృష్ణా మురళి, ప్రృద్వి, సత్య అక్కల, వైవా హర్ష, చిత్రం శ్రీను, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, అశిస్ విద్యార్థి, రఘవ ఉదయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినేష్ కనగరత్నం స్వరాలు సమకుర్చరు.
కథ
గణేష్ (సునీల్) ఓ బడిపంతులు (నాగినీడు) కొడుకు. తన చిన్నప్పుడు తండ్రి క్లాసులో చెప్పిన ఓ పిట్ట కథని నమ్మి అందులో నీతి ని వంటబట్టించుకుని, వయస్సు పెరిగినా అదే నీతిని జీవితానికి ఆచరిస్తూ(మిగతా పనులన్నీ మానుకుని) ముందుకు వెళ్తూంటారు. ఇంతకీ ఆ నీతి ఏమిటయ్యా అంటే...తనకి సాయం చేసినవాళ్లని గుర్తు పెట్టుకొని మరీ తిరిగి సాయం చేయటం. ఆ సాయిం చేసే ప్రాసెస్ లో ఎదుటివాళ్లు నువ్వు వద్దు.. నీ సాయం వద్దురా బాబోయ్ అనే స్దాయిలో విసిగిస్తూంటాడు. అలాంటి గణేష్ కు చిన్నప్పుడు ఓ రౌడీ (జీవీ) చేతిలో నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు. తను ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మరో రౌడీ బైరాగి (కబీర్‌ఖాన్) అని తెలుసుకుంటాడు. అతనికి తను పెద్దయ్యాక ఎట్టి పరిస్దిత్లో అయినా సాయిం చెయ్యాలని బయిలుదేరి, అతను ఎక్కడున్నాడో వెతకటం మొదలెడతాడు. అదే సమయంలో బైరాగి చెల్లెలి సహస్ర (మన్నారా చోప్రా)ని చూసి ప్రేమలో పడతాడు. అప్పుడు ఏం జరిగింది. భైరాగి కు సాయిం చేసాడా.. వంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.