X
తెలుగు » సినిమాలు » జక్కన్న
జక్కన్న

జక్కన్న

Action | Romance | 29 Jul 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జక్కన్న స్టోరీ

జక్కన్న సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సునిల్, మన్నార చోప్రా, కబీర్ దుహాన్ సింగ్, సప్తగిరి, పోసాని కృష్ణా మురళి , ప్రృద్వి, సత్య అక్కల, వైవా హర్ష, చిత్రం శ్రీను, రాజా రవింద్ర, అదుర్స్ రఘు, అశిస్ విద్యార్థి, రఘవ ఉదయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దినేష్ కనగరత్నం స్వరాలు సమకుర్చరు.  కథ గణేష్ (సునీల్) ఓ బడిపంతులు (నాగినీడు) కొడుకు. తన చిన్నప్పుడు తండ్రి క్లాసులో చెప్పిన ఓ పిట్ట కథని నమ్మి అందులో నీతి ని వంటబట్టించుకుని, వయస్సు పెరిగినా అదే నీతిని జీవితానికి ఆచరిస్తూ(మిగతా పనులన్నీ మానుకుని) ముందుకు వెళ్తూంటారు. ఇంతకీ ఆ నీతి ఏమిటయ్యా అంటే...తనకి సాయం చేసినవాళ్లని గుర్తు పెట్టుకొని మరీ తిరిగి సాయం చేయటం. ఆ సాయిం చేసే ప్రాసెస్ లో ఎదుటివాళ్లు నువ్వు వద్దు.. నీ సాయం వద్దురా బాబోయ్‌ అనే స్దాయిలో విసిగిస్తూంటాడు. అలాంటి గణేష్ కు చిన్నప్పుడు ఓ రౌడీ (జీవీ) చేతిలో నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు‌. తను ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మరో రౌడీ బైరాగి (కబీర్‌ఖాన్‌) అని తెలుసుకుంటాడు. అతనికి తను పెద్దయ్యాక ఎట్టి పరిస్దిత్లో అయినా సాయిం చెయ్యాలని బయిలుదేరి, అతను ఎక్కడున్నాడో వెతకటం మొదలెడతాడు. అదే సమయంలో బైరాగి చెల్లెలి సహస్ర (మన్నారా చోప్రా)ని చూసి ప్రేమలో పడతాడు. అప్పుడు ఏం జరిగింది. భైరాగి కు సాయిం చేసాడా.. వంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
Read More

జక్కన్న కాస్ట్ & క్రూ

జక్కన్న సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ క్రిష్ణా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దినేష్ కనగరత్నం
నిర్మాత ఆర్ సుదర్శన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జక్కన్న విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్టైన్...అని టీజర్ లో పబ్లిసిటీ చేసారు. ఓహో..సునీల్ తిరిగి..తన పాత రోజుల్లోకి వెళ్లికామెడీ చెయ్యాలనుకుని నిర్ణయించుకుని వచ్చాడనుకుంటే...పూర్తి నిరాశపరుస్తాడు. సునీల్ కు మనస్సులో మాస్ సినిమా చెయ్యాలని ఉన్నట్లుంది. కానీ కామెడీ చేస్తూంటాడు. దాంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతున్నాయి. అందాల రాముడులో ఎలా కనిపించాడో, పూల రంగడులోనూ అదే ఎక్సప్రెషన్స్ తో కనిపించాడు. ఇప్పుడు జక్కన్నలోనూ అలాగే కామెడీ చేద్దామనుకున్నాడు...కాని కామెడీ పండాలంటే పంచ్ లు,ప్రాసలు దండిగా ఉండాలని డైరక్టర్, హీరో ఫిక్సైనట్లున్నారు. అలాగే సినిమా మొత్తం నింపేసారు. అయితే ఆ ప్రాసలు, పంచ్ లు నవ్వించలేదు సరికదా విసిగించాయి...అందులో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పోలీసాఫీసర్ కట్టప్ప పాత్రలో పృథ్వీ, నందమూరి నటసింహం బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ అంతా పోన్లే సెకండాఫ్ లో ఏదో అద్బుతం జరుగుతుందని భరిస్తే..అదీ మరీ దారుణం అయ్యిపోయింది. అయోమయంగా, కంగాళిగా మారిపోయింది. ఈ కథలో ప్రధాన సమస్య హీరో క్యారక్టరైజేషన్ లో ప్లెక్సివేషన్స్. అతను ఫైట్స్ అప్పుడు సీరియస్ గా , ప్రేమిస్తున్నప్పుడు ఒకలా..కామెడీ చేసేటప్పుడు మరొకలా ఉండటం. దానికితోడు ప్రెడిక్టుబల్ కథనం కూడా సినిమాని నీరు కార్చింది.

జక్కన్న సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జక్కన్న

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+