జనతా గ్యారేజ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్ టి ఆర్, మోహన్ లాల్, సమంత, నిత్య మీనన్, సాయికుమార్, ఉన్ని ముకుందన్, అజై, బ్రహ్మాజి, రెహ్మాన్, బెనర్జీ, దేవయాని, సితార తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివా నిర్వహించారు మరియు నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.
కథ
సత్యం(మోహన్ లాల్) తన జనతాగ్యారేజ్ లో.. కష్టాల్లో ఉన్న సామాన్యులకు,బలహీనులకు సాయం చేస్తూంటాడు. అయితే ఈ ఐడియాలిజీతో ముందుకు వెళ్తున్న ఆయన ముకేష్ (సచిన్ కేడార్కర్) తో విరోధం వస్తుంది. దాంతో తన సోదరుడుని, కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. ఆ నష్టానికి తనే భాధ్యత వహించి తన సోదరుడు కొడుకు ఆనంద్ (ఎన్టీఆర్)కు, ఆ కుటుంబానికి దూరంగా ఉంటానని మాట ఇచ్చి వచ్చేస్తాడు. సంవత్సరాలు గడస్తాయి..ప్రకృతి వీళ్లిద్దరిని దగ్గర చేర్చాలనకుంది. ఆనంద్ పర్యావరణ రక్షకుడుగా మారి,అనుకోని పరిస్దితుల్లో జనతాగ్యారేజ్ కు వస్తాడు. జనతాగ్యారేజ్ కు అతన్ని లీడ్ చేసిన అంశాలేమిటి...ఆనంద్ వచ్చాక జనతాగ్యారేజ్ లో ఏం మార్పు వచ్చింది..అసలేం జరిగింది అనేది తెరపై చూడాల్సిన ఇంటెన్స్ డ్రామా.