X
జయదేవ్
Action | Romance | 30 Jun 2017 | U/A |
Telugu

జయదేవ్ స్టోరీ

జయదేవ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గంటా రవి, మాళవిక, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, హరితేజా, శ్రావణ్, సుప్రీత్, అరవింద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ సి పరాన్జీ వహించారు మరియు నిర్మాత అనిల్ కుమార్ కిషన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు సమకుర్చరు.

కథ

జయదేవ్ (గంటా రవి) సింహాద్రిపురానికి ఇన్స్‌పెక్టర్. పక్కన ఉండే దోసకాయలపాడు గ్రామం ఉంటుంది. ఈ రెండు ఊర్లు కలిసినట్టే ఉంటాయి. వీటి పరిధి తక్కువే కావడంతో రెండు పోలీస్ స్టేషన్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతంలో మస్తాన్ రాజు (వినోద్‌కుమార్) అక్రమ దందాలను నిర్వహిస్తుంటాడు. అక్రమ వ్యాపారాలను ఆటకట్టించడానికి వచ్చే అధికారులను తన క్వారీలో నిర్ధాక్షిణంగా మట్టుపెడుతుంటాడు. మస్తాన్ రాజు వ్యాపారాలను మంగళం పాడించేందుకు ప్రయత్నించిన దోసకాయలపాడు ఎస్‌ఐ శ్రీహరి (రవిప్రకాశ్)‌ను కూడా పెట్రోల్ పోసి తన అనచరులతో దారుణంగా చంపిస్తాడు. ఈ ఘటనతో జయదేవ్ చలించిపోతాడు. తన తోటి పోలీసును చంపిన మస్తాన్ రాజు‌కు శిక్షపడేలా చేయాలని పూనుకొంటాడు. ఈ క్రమంలో నిజాయితీగా వ్యవహరించినందుకు సస్పెన్షన్‌కు గురవుతాడు. అలా అధికారాన్ని కోల్పోయిన జయదేవ్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు. మస్తాన్ రాజును ఆట ఎలా కట్టించాడు. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులు ఏమిటీ? తన మరదలితో ప్రేమ పడిన జయదేవ్ ఆటపాటలతో ఎలా అలరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే జయదేవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+