X
జయదేవ్

జయదేవ్

Action | Romance | 30 Jun 2017 | U/A |
Telugu

3.1 /5 Users

1.5 /5 Filmibeat

జయదేవ్ స్టోరీ

జయదేవ్ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గంటా రవి, మాళవిక, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, హరితేజా, శ్రావణ్, సుప్రీత్, అరవింద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయంత్ సి పరాన్జీ వహించారు మరియు నిర్మాత అనిల్ కుమార్ కిషన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు సమకుర్చరు. కథ జయదేవ్ (గంటా రవి) సింహాద్రిపురానికి ఇన్స్‌పెక్టర్. పక్కన ఉండే దోసకాయలపాడు గ్రామం ఉంటుంది. ఈ రెండు ఊర్లు కలిసినట్టే ఉంటాయి. వీటి పరిధి తక్కువే కావడంతో రెండు పోలీస్ స్టేషన్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ ప్రాంతంలో మస్తాన్ రాజు (వినోద్‌కుమార్) అక్రమ దందాలను నిర్వహిస్తుంటాడు. అక్రమ వ్యాపారాలను ఆటకట్టించడానికి వచ్చే అధికారులను తన క్వారీలో నిర్ధాక్షిణంగా మట్టుపెడుతుంటాడు. మస్తాన్ రాజు వ్యాపారాలను మంగళం పాడించేందుకు ప్రయత్నించిన దోసకాయలపాడు ఎస్‌ఐ శ్రీహరి (రవిప్రకాశ్)‌ను కూడా పెట్రోల్ పోసి తన అనచరులతో దారుణంగా చంపిస్తాడు. ఈ ఘటనతో జయదేవ్ చలించిపోతాడు. తన తోటి పోలీసును చంపిన మస్తాన్ రాజు‌కు శిక్షపడేలా చేయాలని పూనుకొంటాడు. ఈ క్రమంలో నిజాయితీగా వ్యవహరించినందుకు సస్పెన్షన్‌కు గురవుతాడు. అలా అధికారాన్ని కోల్పోయిన జయదేవ్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు. మస్తాన్ రాజును ఆట ఎలా కట్టించాడు. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులు ఏమిటీ? తన మరదలితో ప్రేమ పడిన జయదేవ్ ఆటపాటలతో ఎలా అలరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే జయదేవ్.
Read More

జయదేవ్ కాస్ట్ & క్రూ

జయదేవ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయంత్ సి పరన్జి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత అనిల్ కుమార్ కిషన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జయదేవ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తొలి భాగంలో హీరో ఇంట్రడక్షన్, విలన్ అకృత్యాలు, హీరోయిన్ ఎంట్రీ లాంటి రొటీన్ వ్యవహారాలనే కనిపిస్తాయి. గంటా రవి తొలి పరిచయం కాబట్టి దర్శకుడు జయంత్ ఆయనను నుంచి ప్రతిభను రాబట్టడానికి చేసిన కృషి తెరమీద కనిపిస్తుంది. ఎయోషన్స్ పలికించడానికి రవి చేసిన ప్రయత్నం అభినందనీయం. తోటి పోలీస్ అధికారిని చంపిన మస్తాన్ రాజును శిక్షపడేసేందుకు చేసే పోరాటంలో కొంత పట్టు సాధించే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. హీరో సస్పెన్షన్ కావడం, చేతిలో ఉండే ఆధారాలు ఒక్కొక్కటి జారిపోతుండటం. ఆ క్రమంలో హీరో వేసే ఎత్తులను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబాటు పడ్డాడు. ఇక హీరోయిన్ మాళవిక రాజ్ పాత్ర పాటలకే పరిమితం చేశాడు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్‌లో పవర్ ఫుల్ విలనిజం కనిపించకపోవడం, దానికి తోడు రవి నటనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనపడటం సినిమా సాదాసీదాగా సాగిపోతుంది. రోటీన్ తరహాలో మస్తాన్ రాజును ఆటకట్టించడంతో జయదేవ్‌కు ఎండ్ టైటిల్ పడిపోతుంది.

జయదేవ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3.1 /5 Your Rating

జయదేవ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+