కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, స్వాతి, బ్రహ్మానందం, సాక్షి, రఘుబాబు, అజయ్,ఆదర్స్ తదితురులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
కథ
అమలాపురం రంభ దియేటర్లో రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ విశ్లేషించుకునే అప్పలరాజు(సునీల్)కి ఓ శుభ ముహూర్తాన హైదరాబాద్ వెళ్ళి డైరక్టర్ అవ్వాలనే ఆలోచన పుడుతుంది. పుట్టిందే తడువుగా హైదరాబాద్ లో వాలి రాకీ(రఘుబాబు) అనే సెక్స్ సినిమా నిర్మాతను కలసి సినిమా కథ చెప్పి ఒప్పిస్తాడు. కానీ తన వద్ద రూపాయి కూడా లేని రాకీ ఎలాగయినా ఈ కథతో సినిమా తీయాలని(సెక్స్ సినిమాలు తీసుకునే ఆ నిర్మాతకు ఈ అనుభవం లేని కొత్త దర్శకుడు చెప్పిన కథలో ఏం పాయింటు నచ్చిందో మరి) నిర్ణయించుకుని ఫైనాన్సియర్స్ చుట్టూ తిప్పుతాడు. ఆ ఫైనాన్సియర్స్ ఒక్కొక్కరూ ఒక్కో రకం...తమ ఆలోచనలు,అవసరాలు ఈ కథలో రుద్దాలని ప్రయత్నిస్తూంటారు.దానికి ఒప్పుకోని అప్పలరాజుకి ఎవరైనా ఓ స్టార్ సినిమా చేస్తానంటే ఫైనాన్స్ దొరకటం ఈజీ అవుతుందని తెలుస్తుంది. దాంతో స్టార్ హీరోయిన్ కనిష్క(సాక్షి) ని ఒప్పిస్తాడు.ఆమెతో పాటు ప్యాకేజీలా స్టార్ హీరో బాబు(ఆదర్శ్) సీన్ లోకి వస్తాడు.స్టార్,స్టార్ హీరో,హీరోయిన్ దొరికగానే డేటాబేస్(కృష్ణభగవాన్) అనే కార్పోరేట్ కంపెనీ వాడు ఫైనాన్స్ చేస్తానంటాడు. అంతా సెట్ అయింది సినిమా ప్రారంభిద్దామనుకునేసరికి ఆ హీరో,హీరోయిన్స్ ఇద్దరూ బ్రేక్ అప్ అయి విడిపోతారు. అప్పలరాజు సినిమా ఆగిపోతుంది. ఆ స్ధితిలో అప్పలరాజు తన సినిమా ఎలా పూర్తి చేసాడు అనేది మిగతా కథ.