X
తెలుగు » సినిమాలు » కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు

Comedy | 18 Feb 2011 | U/A |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు స్టోరీ

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, స్వాతి, బ్రహ్మానందం, సాక్షి, రఘుబాబు, అజయ్,ఆదర్స్ తదితురులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు. కథ అమలాపురం రంభ దియేటర్లో రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ విశ్లేషించుకునే అప్పలరాజు(సునీల్)కి ఓ శుభ ముహూర్తాన హైదరాబాద్ వెళ్ళి డైరక్టర్ అవ్వాలనే ఆలోచన పుడుతుంది. పుట్టిందే తడువుగా హైదరాబాద్ లో వాలి రాకీ(రఘుబాబు) అనే సెక్స్ సినిమా నిర్మాతను కలసి సినిమా కథ చెప్పి ఒప్పిస్తాడు. కానీ తన వద్ద రూపాయి కూడా లేని రాకీ ఎలాగయినా ఈ కథతో సినిమా తీయాలని(సెక్స్ సినిమాలు తీసుకునే ఆ నిర్మాతకు ఈ అనుభవం లేని కొత్త దర్శకుడు చెప్పిన కథలో ఏం పాయింటు నచ్చిందో మరి) నిర్ణయించుకుని ఫైనాన్సియర్స్ చుట్టూ తిప్పుతాడు. ఆ ఫైనాన్సియర్స్ ఒక్కొక్కరూ ఒక్కో రకం...తమ ఆలోచనలు,అవసరాలు ఈ కథలో రుద్దాలని ప్రయత్నిస్తూంటారు.దానికి ఒప్పుకోని అప్పలరాజుకి ఎవరైనా ఓ స్టార్ సినిమా చేస్తానంటే ఫైనాన్స్ దొరకటం ఈజీ అవుతుందని తెలుస్తుంది. దాంతో స్టార్ హీరోయిన్ కనిష్క(సాక్షి) ని ఒప్పిస్తాడు.ఆమెతో పాటు ప్యాకేజీలా స్టార్ హీరో బాబు(ఆదర్శ్) సీన్ లోకి వస్తాడు.స్టార్,స్టార్ హీరో,హీరోయిన్ దొరికగానే డేటాబేస్(కృష్ణభగవాన్) అనే కార్పోరేట్ కంపెనీ వాడు ఫైనాన్స్ చేస్తానంటాడు. అంతా సెట్ అయింది సినిమా ప్రారంభిద్దామనుకునేసరికి ఆ హీరో,హీరోయిన్స్ ఇద్దరూ బ్రేక్ అప్ అయి విడిపోతారు. అప్పలరాజు సినిమా ఆగిపోతుంది. ఆ స్ధితిలో అప్పలరాజు తన సినిమా ఎలా పూర్తి చేసాడు అనేది మిగతా కథ.
Read More

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు కాస్ట్ & క్రూ

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా పరిశ్రమ అనేది బయిటకు కనపడినంత గ్లామర్ గా లోపల ఉండదనేది అందరికీ తెలిసిన నిజమే అయినా ఒప్పుకోవటానికి ఎవరికీ ఆసక్తి ఉండదనేది నిజం. అందుకేనేమో సినిమావాళ్ళ మీద సినిమా తీయటం ఎప్పుడూ సాహసమేనంటారు సినీ జీవులు. అయితే అప్పుడప్పడూ కొందరు ధైర్యం చేసి సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో నేనింతే,ఒక విచిత్రం వంటివి రూపొందిస్తూనే ఉన్నారు...భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడ్తూనే ఉన్నారు. ఆ కోవలో సునీల్ వంటి కామిడీ హీరోని పెట్టుకుని సీరియస్ సినిమా ..అదీ సినీ బ్యాక్ గ్రౌండ్ లో చేసిన ఘనత మాత్రం నిత్య ప్రయోగశీలి రామ్ గోపాల్ వర్మకే దక్కింది. కథను నమ్ముకుని చేసానంటున్న ఈ సినిమాకి ఆయన కామిడీ ప్యాండిగ్ ని అయితే ఇచ్చాడు గానీ, కామిడీ పంచ్ ని మాత్రం ఇవ్వలేకపోయారు. సునీల్ ఉన్నాడు కదా కామిడీ గ్యారెంటీ అని ధియోటర్ కి వెళ్ళిన సగటు ప్రేక్షకుడుకి నిరాశ ఎదురౌతోంది.

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+