కేజీఎఫ్ చాప్టర్ 2 (2022)(U/A)
కేజీఎఫ్ చాప్టర్ 2 స్టోరి
కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యాష్, శ్రీనిధి శేట్టి, అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మాల్విక అవినాష్, అర్చన జోయిస్, లక్ష్మణ్, అయ్యప్ప పి శర్మ, హారిష్ రాయ్, దినేష్ మంగళూరు, బి సురేష్, బి ఎస్ అవినాష్, వినయ్ బిడప్ప, యాష్ శేట్టి, గోవిందె గౌడ, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ నీల్ వహించారు మరియు విజయ్ కిరగందర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రుర్ అందించారు.
కథ
కేజీఎఫ్ ప్రాంతంలో అధిపత్యం కొనసాగిస్తున్న గరుడను మట్టుపెట్టిన తర్వాత రాకీ భాయ్ (యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు దూకుడు పెంచుతాడు. ఒకే ఒక బంగారు మైనింగ్ అనుకొంటున్న సమయంలో తొమ్మిదికిపైగా బంగారు గనులను కనుగొంటాడు. ప్రపంచ గోల్డ్ బిజినెస్ రంగంలో రాకీ భాయ్ రారాజుగా మారిపోతాడు. బయటి ప్రపంచం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కేజీఎఫ్ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడనే వార్త సీబీఐ నుంచి దేశ ప్రధాని (రవీనా టాండన్) కి చేరుతుంది. అయితే రాకీ భాయ్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ప్రధాని రంగంలోకి దిగుతుంది. కేజీఎఫ్‌లో తన సామ్రాజ్యాన్ని రాకీ భాయ్ ఎలా విస్తరించాడు? అప్పటికే అధిపత్యం కొనసాగిస్తున్న ముఠాను ఎలా తన మార్గం నుంచి తొలగించుకొన్నాడు? కేజీఎఫ్‌లో రాకీ భాయ్ వ్యవహారాలపై సీబీఐ ఎందుకు కన్నేసింది? రాకీ భాయ్‌ని నిలువరించేందుకు అధీరా (సంజయ్ దత్) ఎలాంటి పన్నాగాలు పన్నాడు. తన మార్గంలోకి ఎదురు వచ్చిన అధీరాను రాకీ భాయ్ ఎలా నిలువరించాడు? తన సామ్రాజ్యాన్ని కూల్చడానికి మాస్టర్ మైండ్‌గా మారిన కేంద్రమంత్రిపై రాకీ భాయ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? రాకీ భాయ్ కథకు ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే KGF Chapter 2 సినిమా కథ.