కిక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, ఇలియానా, శ్యామ్, ఆషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్,అలీ, సాయాజీ షిండే, చలపతిరావు, నళిని, ప్రభ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్రర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు.
కథ
మలేషియాలో నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(తమిళ హీరో శ్యామ్)కి పెళ్ళి చూపులు. ఆమె మాటల్లో మాటగా తను ఒకరికి బుద్ది చెప్పాలని తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో కళ్యాణ్ (రవితేజ) గురించి ఉంటుంది. రవితేజ చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవరిస్తూంటాడు. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు...కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు. దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమంటుంది.
దానికి ఒప్పుకోలేదని ఆమె బై చెబుతుంది. ఇదంతా విన్న పెళ్లికొడుకుతనను ఒకడు ముప్పు తిప్పలు పెడుతున్నాడని, అతన్ని పట్టుకోవటానికే మలేషియా వచ్చానని ప్లాష్ బ్యాక్ విప్పుతాడు. అతని ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ ఓ గజ దొంగ. అతన్ని పట్టుకోవటానికి స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ప్రత్యేకంగా నియమింపబడతాడు. అయితే రవితేజ తన ముఖం కనపడకుండా మాస్క్ వేసుకుని దొంగతనాలు చేస్తూంటాడు. దాంతో శ్యామ్ కి దొరకక ట్విస్ట్ లు ఇస్తూంటాడు. అతని పట్టుకోవటమే శ్యామ్ తన జీవితాశయంగా చెపుతాడు. ఇక ఇద్దరికి ఎదుటి వారు చెప్పేది తనకి తెలిసిన రవితేజ గురించేనన్న విషయం తెలియదు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ లోనే రవితేజ వారికెదురుకుండా ప్రత్యక్ష్యమవుతాడు. ఇంతకీ రవితేజను..ఆ పోలీస్ ఆఫీసర్ గుర్తించి పట్టుకుంటాడా..ఇలియానా మళ్ళీ ఎలా దగ్గరైంది...అసలు రవితేజ ఎందుకు దొంగగా మారాడు అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.