X
కిక్

కిక్

Action | Romance | 08 May 2009 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కిక్ స్టోరీ

కిక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, ఇలియానా , శ్యామ్‌, ఆషిక, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, అలీ, సాయాజీ షిండే, చలపతిరావు, నళిని, ప్రభ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్రర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు. కథ మలేషియాలో నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(తమిళ హీరో శ్యామ్)కి పెళ్ళి చూపులు. ఆమె మాటల్లో మాటగా తను ఒకరికి బుద్ది చెప్పాలని తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో కళ్యాణ్ (రవితేజ) గురించి ఉంటుంది. రవితేజ చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవరిస్తూంటాడు. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు...కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు. దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమంటుంది. దానికి ఒప్పుకోలేదని ఆమె బై చెబుతుంది. ఇదంతా విన్న పెళ్లికొడుకుతనను ఒకడు ముప్పు తిప్పలు పెడుతున్నాడని, అతన్ని పట్టుకోవటానికే మలేషియా వచ్చానని ప్లాష్ బ్యాక్ విప్పుతాడు. అతని ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ ఓ గజ దొంగ. అతన్ని పట్టుకోవటానికి స్ట్రిక్టు పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ప్రత్యేకంగా నియమింపబడతాడు. అయితే రవితేజ తన ముఖం కనపడకుండా మాస్క్ వేసుకుని దొంగతనాలు చేస్తూంటాడు. దాంతో శ్యామ్ కి దొరకక ట్విస్ట్ లు ఇస్తూంటాడు. అతని పట్టుకోవటమే శ్యామ్ తన జీవితాశయంగా చెపుతాడు. ఇక ఇద్దరికి ఎదుటి వారు చెప్పేది తనకి తెలిసిన రవితేజ గురించేనన్న విషయం తెలియదు. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ లోనే రవితేజ వారికెదురుకుండా ప్రత్యక్ష్యమవుతాడు. ఇంతకీ రవితేజను..ఆ పోలీస్ ఆఫీసర్ గుర్తించి పట్టుకుంటాడా..ఇలియానా మళ్ళీ ఎలా దగ్గరైంది...అసలు రవితేజ ఎందుకు దొంగగా మారాడు అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Read More

కిక్ కాస్ట్ & క్రూ

కిక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత వెంకట్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కిక్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వరస చెత్త చూస్తున్నాం..ఇదైనా కిక్కు ఇస్తుందంటావా..రవితేజ,సురేంద్రరెడ్డి తొలి కాంబినేషన్ కదా...కసిగా చేసుంటారు..అంటూ కిక్ ధియోటర్స్ లో దూరిన వాళ్ళకి కిక్ సగమే దొరికింది.ప్రారంభంలో అదిరిపోయే హీరో క్యారెక్టరైజేషన్ తో హీటెక్కిన సినిమా కథ దగ్గరకు వచ్చేసరికి చల్లపడింది. ఇక అర్జున్ జెంటిల్ మెన్ చిత్రాన్ని లేటెస్ట్ వెర్షన్ లో చూస్తున్నట్లు ఉన్న ఈ చిత్రంలో రవితేజ మ్యానరిజమ్స్, ఇలియానా ఒంపుసొంపులు, రసూల్ కెమెరా సినిమాను ఎనర్జీ లెవిల్స్ లో ఉంచటానికి ట్రై చేసాయి.బి,సి సెంటర్స్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రానికి ఏ సినిమాలు పోటీ లేకపోవటం కొంతలో కొంత కలిసివచ్చే అంశం.

కిక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కిక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+