కొండ పొలం (2021)(U)
Release date
08 Oct 2021
genre
కొండ పొలం స్టోరి
కొండ పొలం సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చాంద్, కోట శ్రీనివాస రావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి వహించారు. నిర్మాతలు వై రాజీవ్ రెడ్డి, జె సాయి బాబు కలిసి నిర్మించారు. సంగీతం ఎం ఎం కీరవాణి అందించారు.
కథ
కడప జిల్లాలోని గొర్ల కాపరి కుటంబానికి చెందిన కటారు రవి యాదవ్ (పంజా వైష్ణవ్ తేజ్) ఉన్నత చదువులు చదివినప్పటికీ ఇంటర్వ్యూ ఫోభియాతో ఉద్యోగం సంపాదించాలేకపోతాడు. నిరాశ, నిస్పృహలతో ఇంటికి చేరుకొని తండ్రి (సాయిచంద్) తో పాటు ఓబు (రకుల్ ప్రీత్ సింగ్) గొర్లను కాచేందుకు కొండ పొలంకు వెళ్తారు. నల్లమల ప్రాంతం కలప స్మగ్లింగ్‌కు పాల్పడే గుంటనక్కలను, పులి బారిన పడే గొర్లను కాపాడేందుకు రవి ముందడుగు వేస్తాడు? కొండ పొలంకు వెళ్లిన రవిలో కలిగిన మానసిక ప్రవర్తనకు, తెచ్చుకొన్న మనోధైర్యం కారణాలు ఏమిటి? తనకు బావ లాంటి రవిపై మనసు పడిన ఓబుకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది. సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ.. అటవీ అధికారి పోస్టును ఎందుకు కోరుకొన్నారు? ఎలాంటి అనుభవాలు, జీవిత పాఠాలతో రవి తన లక్ష్యాలను చేరుకొన్నాడు? ముఖ్యంగా ఇంటర్వ్యూలో మనోధైర్యం కోల్పోయే రవికి అడవి తల్లి నేర్పిన జీవిత పాఠాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కొండ పొలం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie కొండ పొలం with us? Please send it to us ([email protected]).