కొత్త జంట సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి నిర్వహించారు మరియు నిర్మాత: బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జేబి స్వరాలు సమకుర్చారు.
కథ
టీవీ ఛానెల్ లో పనిచేసే శిరీష్(అల్లు శిరీష్) ,సువర్ణ(రెజీనా) ఇద్దరూ బాగా స్వార్ధపరులు...కానీ టాలెంటెడ్. వీళ్ళిద్దరూ టీఆర్పీలు లేక మూలన పడిన ఓ తెలుగు ఛానెల్ ని నిలబెట్టి నెంబర్ వన్ చేయటానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కొత్త జంట అనే పోగ్రాం డిసి ఒకటి చేస్తారు. ఆ పోగ్రాం లక్ష్యం... కుల,మత,వర్ణ,వర్గ,పేదా,ధనిక తారతమ్యం తో పెళ్లిళ్లలకు ఇబ్బందులు ఎదరువుతున్న జంటలకు తమ ఛానెల్ లో లైవ్ పోగ్రాం తో పెళ్లిళ్లు చేయటం. అలా పెళ్ల్ళిళ్లు చేస్తే గొడవలు జరిగి, తమకు టీఆర్పీలు వస్తాయని ప్లాన్. అనుకున్నట్లుగానే ఆ పోగ్రాం సక్సెస్ అవుతుంది. అయితే ఊహించని విధంగా శత్రువులను తెచ్చి పెడుతుంది.
మరో ప్రక్క బిజినెస్ మ్యాన్(పోసాని)కి సువర్ణ అంటే ఇష్టం. ఆమెతో గడపాలనుకునే అతను కొత్త ఛానెల్ లాంచ్ చేస్తానని శిరీష్ ని పిలిచి మంచి జీతంతో కెరీర్ ఆఫర్ ఇస్తాడు. అయితే సువర్ణని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అయితే పోసాని ఇంటెన్షన్ అర్దం చేసుకున్న సువర్ణ ...ఆ ప్రపొజల్ కు నో చెప్తుంది. కానీ అప్పటికే పోసాని ఇచ్చే డబ్బుతో ప్రేమలో ఉన్న శిరీష్....ఆమెను ఎలాగైనా ఒప్పించటానికి ఆమెని ప్రేమిస్తున్నానని నాటకం ఆడతాడు. అది నిజమని నమ్మిన శిరీష ...అతనితో ప్రేమలో నిజంగానే పడుతుంది. అప్పుడు ఏమైంది... నిజం ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది...చివరకు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.