X
తెలుగు » సినిమాలు » కొత్త జంట
కొత్త జంట

కొత్త జంట

Romance | 01 May 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కొత్త జంట స్టోరీ

కొత్త జంట సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, రెజీనా , మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి నిర్వహించారు మరియు నిర్మాత: బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జేబి స్వరాలు సమకుర్చారు. కథ టీవీ ఛానెల్ లో పనిచేసే శిరీష్(అల్లు శిరీష్) ,సువర్ణ(రెజీనా) ఇద్దరూ బాగా స్వార్ధపరులు...కానీ టాలెంటెడ్. వీళ్ళిద్దరూ టీఆర్పీలు లేక మూలన పడిన ఓ తెలుగు ఛానెల్ ని నిలబెట్టి నెంబర్ వన్ చేయటానికి కలిసి పనిచేయాల్సి వస్తుంది. అందులో భాగంగా కొత్త జంట అనే పోగ్రాం డిసి ఒకటి చేస్తారు. ఆ పోగ్రాం లక్ష్యం... కుల,మత,వర్ణ,వర్గ,పేదా,ధనిక తారతమ్యం తో పెళ్లిళ్లలకు ఇబ్బందులు ఎదరువుతున్న జంటలకు తమ ఛానెల్ లో లైవ్ పోగ్రాం తో పెళ్లిళ్లు చేయటం. అలా పెళ్ల్ళిళ్లు చేస్తే గొడవలు జరిగి, తమకు టీఆర్పీలు వస్తాయని ప్లాన్. అనుకున్నట్లుగానే ఆ పోగ్రాం సక్సెస్ అవుతుంది. అయితే ఊహించని విధంగా శత్రువులను తెచ్చి పెడుతుంది.  మరో ప్రక్క బిజినెస్ మ్యాన్(పోసాని)కి సువర్ణ అంటే ఇష్టం. ఆమెతో గడపాలనుకునే అతను కొత్త ఛానెల్ లాంచ్ చేస్తానని శిరీష్ ని పిలిచి మంచి జీతంతో కెరీర్ ఆఫర్ ఇస్తాడు. అయితే సువర్ణని తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అయితే పోసాని ఇంటెన్షన్ అర్దం చేసుకున్న సువర్ణ ...ఆ ప్రపొజల్ కు నో చెప్తుంది. కానీ అప్పటికే పోసాని ఇచ్చే డబ్బుతో ప్రేమలో ఉన్న శిరీష్....ఆమెను ఎలాగైనా ఒప్పించటానికి ఆమెని ప్రేమిస్తున్నానని నాటకం ఆడతాడు. అది నిజమని నమ్మిన శిరీష ...అతనితో ప్రేమలో నిజంగానే పడుతుంది. అప్పుడు ఏమైంది... నిజం ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది...చివరకు వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కొత్త జంట కాస్ట్ & క్రూ

కొత్త జంట సిబ్బంది సమాచారం

దర్శకత్వం మారుతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కొత్త జంట విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రొమాంటిక్ కామెడీ జానర్ లో మొదలైన ఈ కథ రాను రాను...ఒన్ సైడ్ లవ్ స్టోరీ గా తయారైంది. దాంతో ఫన్ మెల్లిగా తగ్గిపోవనటం మొదలైంది. మొదట్లో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ స్వార్ధపరులు....కలిసి పనిచేస్తున్నారు..ప్రేమలో పడుతున్నారు...అన్నట్లు మొదలై......తర్వాత హీరోయిన్ మాత్రమే ప్రేమలో పడి...తూచ్ నేను స్వార్ధపరురాలిని కాదు నా క్యారెక్టర్ ఛేంజ్ అని డెసిషన్ తీసుకుని...హీరోని ఒంటిరిని చేసేసింది. పాపం హీరో..ఒక్కడే స్వార్ధపరుడుగా...హీరోయిన్ ప్రేమను అర్దం చేసుకోని వాడిగా...(అఫ్ కోర్స్ ఆ స్వార్ధం తో అతను సాధించాలనుకున్న సొంత ఛానెల్ పెట్టాలనే లక్ష్యం దిసగా కూడా ఏమీ చేయడనుకోండి) మిగిలిపోయి...హీరోయిన్ వైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసాడు. దాంతో రొమాంటిక్ కామెడీ కాస్తా...సెంటిమెంట్ లవ్ స్టోరీగా తయారైంది. దానికి తోడు...హీరోయిన్ సూసైడ్ సీన్స్ ఎందుకు పెట్టారో అర్దం కాదు.లవ్ స్టోరీ కదా డెప్త్ తేవాలనకున్నారో ఏమో కానీ మోడ్రన్ గా ఉండి టీవీ క్రియోవిట్ హెడ్ ఉద్యోగం చేసే అమ్మాయి ఇలా సూసైడ్ డెసిషన్స్ తీసుకుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది.

కొత్త జంట సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కొత్త జంట

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+