లడ్డుబాబు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన - దర్శకత్వం: రవిబాబు నిర్వహించారు మరియు నిర్మాత త్రిపురనేని రాజేంద్రప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
268 కిలోలు బరువుతో బాధపడుతున్న లడ్డుబాబు (అల్లరి నరేష్) కి ఎలాగైనా పెళ్లి చేయాలని అతని తండ్రి కిట్టయ్య(కోట శ్రీనివాసరావు) విశ్వ ప్రయత్నాలు చేస్తూంటాడు. ఎందుకంటే లడ్డుబాబుకి పెళ్లైతేనే కిట్టయ్య తన ఆస్తిని అమ్ముకోగలడు. ఇదిలా ఉంటే లడ్డూబాబుతో మూర్తి(అతులిత్) అనే పిల్లాడు స్నేహం చేయమని రోజూ అతన్ని విసిగిస్తూంటాడు. ఆ పిల్లాడి తల్లి(భూమిక). మరో ప్రక్క లడ్డూ బాబు తనకూ ఓ గాళ్ ఫ్రెండ్ ఉండాలని కలలు కని, మాయ(పూర్ణ)తో ప్రేమలో పడి వెంటబడతాడు. అంతేగాక తండ్రి తెచ్చే సంభంధాలు అన్నీ రిజక్ట్ చేస్తాడు. అయితే కొంతకాలానికి ఆమెకు తనలాంటి వాడిని పెళ్లి చేసుకోవటం ఇంటరస్ట్ లేదని తెలుసుకుంటాడు. దాంతో తన సమస్యకు పరిష్కారం ఒళ్లు తగ్గటమే అని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏమైంది. లడ్డూబాబు పెళ్లైందా..ప్రేమ ఫలించిందా...మూర్తి అనే పిల్లాడు ఎందుకు లడ్డూబాబు వెనక పడుతున్నాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.