లక్ష్మీ రావే మాఇంటికి సినిమా కుటుంబ నేపద్యంలో జరిగే ప్రేమకథతో సాగే చిత్రం ఇందులోనాగశౌర్య, అవికాగోరే, వీళ్ళతో పాటు రావు రమేష్, పవిత్ర లోకెష్, నరేశ్, ప్రగత్య, వెన్నెల కిశోర్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్నారు, గిరిధర్ ప్రోడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ నిర్మించారు. సంగీతం కె యమ్ రాధకృష్ణన్ స్వరాలు సమకుర్చారు.
కథ
లక్ష్మీ ఆనంద్ తండ్రి.. సర్వేష్ ఆనందరావు (రావు రమేష్)ఓ బొమ్మరిల్లు తరహా తండ్రి. ఇంట్లో స్ట్రిక్టుగా రూల్స్ అమలు చేస్తూంటాడు. అంతేకాదు తన కూరుతుకి ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తో నిశ్చితార్దం కూడా చేసేస్తాడు. లక్ష్మి కూడా తండ్రి మాట జవదాటే అమ్మాయి కాదు. ఈలోగా...రికామీగా ఇడియట్ లా తిరిగే ..సాయి(నాగ శౌర్య).. తొలి చూపులోనే లక్ష్మీ ఆనంద్ (అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. మరోప్రక్క అతనికి తెలియకుండానే సర్వేష్ ఆనందరావు దృష్టిలో చెడ్డవాడుగా ముద్రపడతాడు. ఇలాంటి పరిస్ధితిల్లో ఆమెని, ఆమె తండ్రిని ఒప్పించి ఎలా లక్ష్మి ని తన ఇంటికి తెచ్చుకున్నాడనేది మిగతా కథ.