X
తెలుగు » సినిమాలు » లక్ష్మీ రావే మాఇంటికి
లక్ష్మీ రావే మాఇంటికి

లక్ష్మీ రావే మాఇంటికి

Romance | 05 Dec 2014 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లక్ష్మీ రావే మాఇంటికి స్టోరీ

లక్ష్మీ రావే మాఇంటికి సినిమా కుటుంబ నేపద్యంలో జరిగే ప్రేమకథతో సాగే చిత్రం ఇందులో నాగశౌర్య, అవికాగోరే , వీళ్ళతో పాటు రావు రమేష్, పవిత్ర లోకెష్, నరేశ్, ప్రగత్య, వెన్నెల కిశోర్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్నారు, గిరిధర్ ప్రోడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ నిర్మించారు. సంగీతం కె యమ్ రాధకృష్ణన్ స్వరాలు సమకుర్చారు. కథ లక్ష్మీ ఆనంద్ తండ్రి.. సర్వేష్ ఆనందరావు (రావు రమేష్)ఓ బొమ్మరిల్లు తరహా తండ్రి. ఇంట్లో స్ట్రిక్టుగా రూల్స్ అమలు చేస్తూంటాడు. అంతేకాదు తన కూరుతుకి ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ తో నిశ్చితార్దం కూడా చేసేస్తాడు. లక్ష్మి కూడా తండ్రి మాట జవదాటే అమ్మాయి కాదు. ఈలోగా...రికామీగా ఇడియట్ లా తిరిగే ..సాయి(నాగ శౌర్య).. తొలి చూపులోనే లక్ష్మీ ఆనంద్ (అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. మరోప్రక్క అతనికి తెలియకుండానే సర్వేష్ ఆనందరావు దృష్టిలో చెడ్డవాడుగా ముద్రపడతాడు. ఇలాంటి పరిస్ధితిల్లో ఆమెని, ఆమె తండ్రిని ఒప్పించి ఎలా లక్ష్మి ని తన ఇంటికి తెచ్చుకున్నాడనేది మిగతా కథ.
Read More

లక్ష్మీ రావే మాఇంటికి కాస్ట్ & క్రూ

లక్ష్మీ రావే మాఇంటికి సిబ్బంది సమాచారం

దర్శకత్వం నంద్యాల రవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కె యమ్ రాధకృష్ణన్
నిర్మాత గిరిధర్ మామిడిపల్లి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లక్ష్మీ రావే మాఇంటికి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రొమాంటిక్ కామెడీ డిజైన్ రొటీన్ గానే ఉన్నా వాటిని ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ లతో, కొత్త క్యారెక్టరైజేషన్స్ తో నింపి పండిస్తూంటారు. ఇక్కడ అదే కొరవడింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో నడిచిన ఈ చిత్రం మొదటే చెప్పుకున్నట్లు ఈ చిత్రంలో కథే పెద్ద మైనస్...మహా నస వ్యవహారమూనూ...రొటీన్ క్యారక్టరైజేషన్స్ కు తోడు...పరమ రొటీన్ స్టోరీ లైన్..ఇవి చాలదన్నట్లు ప్రాసలతో పంచ్ డైలాగులు. అవి హీరో చెప్తూంటే...అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడా కొంచెం కూడా మ్యాచ్ కావు. హీరోయిన్ పాత్ర కు కొంచెం కూడా క్లారిటీ లేదు. దాంతో క్యారికేచర్ లాగ మిగిలిపోయింది. ఆమె క్లైమాక్స్ లో హఠాత్తుగా ...సినిమా ముగిసిపోయిందనో ...మరెందుకో.. హీరో ప్రేమని ఏక్సెప్టు చేస్తోందో...ఎందుకు చివరి వరకూ అలా మెయింటైన్ చేసిందో దర్శక,రచయితకే తెలియాలి.

లక్ష్మీ రావే మాఇంటికి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లక్ష్మీ రావే మాఇంటికి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+