twitter

    లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరి

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్యామిలి, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాంగోపాల్ వర్మ, ఆగస్త్య మంజు వహించారు మరియు నిర్మాతలు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కల్యాణి మాలిక్ అందించారు. 

    కథ

    1989 తర్వాత అధికారం కోల్పోయి, కుటుంబం, నేతలు, స్నేహితులు, సన్నిహితులు దూరమై ఎన్టీఆర్ (విజయ్ కుమార్) ఒంటరిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న సమయంలో తన జీవిత చరిత్రను రాయడానికి లక్ష్మీపార్వతి (యజ్ఞశెట్టి) ఆయన గడపలోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీపార్వతి మాటలు, వ్యక్తిత్వం వల్ల ఆమెకు ఆయన దగ్గరవువతాడు. ఇది బాబు ( శ్రీ తేజ్)కు, కుటుంబానికి, నేతలకు సహించదు. ఎన్టీఆర్‌ నుంచి దూరం కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆమె పట్ల ఉన్న నమ్మకం, ప్రేమ వల్ల ఆయనకు లక్ష్మీపార్వతి మరింత చేరువవుతుంది. ఈ క్రమంలో తన చుట్టు ఉన్న కుటుంబ సభ్యులు, బాబు వ్యూహాలను పసిగట్టిన ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతికి భద్రత కల్పించడానికి మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుకలో వివాహం చేసుకొంటున్నట్టు ప్రకటిస్తాడు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకొన్న తర్వాత బాబు శిబిరం పన్నిన వ్యూహాలు ఏమిటి? లక్ష్మీపార్వతిపై బాబు ఎలాంటి నిందలు మోపాడు? లక్ష్మీపార్వతిని బూచిగా చూపి బాబు చేసిన కుట్రలు ఏమిటి? వైశ్రాయి హోటల్ వద్ద చెప్పులు విసిరిన ఘటన తర్వాత ఎన్టీఆర్ మానసికంగా ఎలా చనిపోయాడు? ఎన్టీఆర్ మరణానికి బాబు ఎలా కారణమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie లక్ష్మీస్ ఎన్టీఆర్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X