X
తెలుగు » సినిమాలు » లక్ష్మీస్ ఎన్టీఆర్
లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

Biography | 29 Mar 2019 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్యామిలి, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ కుమార్, యజ్ఞశెట్టి, శ్రీ తేజ్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాంగోపాల్ వర్మ, ఆగస్త్య మంజు వహించారు మరియు నిర్మాతలు రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కల్యాణి మాలిక్ అందించారు.  కథ 1989 తర్వాత అధికారం కోల్పోయి, కుటుంబం, నేతలు, స్నేహితులు, సన్నిహితులు దూరమై ఎన్టీఆర్ (విజయ్ కుమార్) ఒంటరిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న సమయంలో తన జీవిత చరిత్రను రాయడానికి లక్ష్మీపార్వతి (యజ్ఞశెట్టి) ఆయన గడపలోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీపార్వతి మాటలు, వ్యక్తిత్వం వల్ల ఆమెకు ఆయన దగ్గరవువతాడు. ఇది బాబు ( శ్రీ తేజ్)కు, కుటుంబానికి, నేతలకు సహించదు. ఎన్టీఆర్‌ నుంచి దూరం కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆమె పట్ల ఉన్న నమ్మకం, ప్రేమ వల్ల ఆయనకు లక్ష్మీపార్వతి మరింత చేరువవుతుంది. ఈ క్రమంలో తన చుట్టు ఉన్న కుటుంబ సభ్యులు, బాబు వ్యూహాలను పసిగట్టిన ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతికి భద్రత కల్పించడానికి మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేడుకలో వివాహం చేసుకొంటున్నట్టు ప్రకటిస్తాడు. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకొన్న తర్వాత బాబు శిబిరం పన్నిన వ్యూహాలు ఏమిటి? లక్ష్మీపార్వతిపై బాబు ఎలాంటి నిందలు మోపాడు? లక్ష్మీపార్వతిని బూచిగా చూపి బాబు చేసిన కుట్రలు ఏమిటి? వైశ్రాయి హోటల్ వద్ద చెప్పులు విసిరిన ఘటన తర్వాత ఎన్టీఆర్ మానసికంగా ఎలా చనిపోయాడు? ఎన్టీఆర్ మరణానికి బాబు ఎలా కారణమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కథ.
Read More

లక్ష్మీస్ ఎన్టీఆర్ కాస్ట్ & క్రూ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత రాకేష్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లక్ష్మీస్ ఎన్టీఆర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏపీ రాజకీయాలపై సంధించిన విమర్శనాస్త్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి ఎలాంటి కుట్రలు జరిగాయనేది ఈ చిత్ర కథ. . ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన చిత్ర ఇది. కథకు ఉపయోగించిన సీన్లలో వాస్తవం ఉందా అనే విషయం పక్కన పెడితే సినిమాకు మాత్రం కమర్షియల్‌గా ఎంతో బలంగా మారాయి. భావితరాలకు ఎన్టీఆర్ ఔన్నత్యం, ఆయన ముక్కుసూటి తనం, అతని ప్రజాదరణ చాటిచెప్పడానికి చెప్పడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సమయంలో సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేల్చాల్సి ఉంటుంది. మరో రెండో రోజుల్లో సినిమా సక్సెస్ రేంజ్ తప్పక తెలుస్తుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లక్ష్మీస్ ఎన్టీఆర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+