లీడర్ సినిమా పోలిటికల్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దగ్గుపాటి రాణా, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్, సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి, సహాసిని, సుమన్. ఐటం సాంగ్ లో ఉదయభాను తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల నిర్వహించారు మరియు నిర్మాతలు ఎమ్.శవరణ్, ఎమ్ ఎస్ గుహన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
రాష్ట్ర ముఖ్యమంత్రి (సుమన్) అయిన తండ్రి ఓ బాంబ్ బ్లాస్ట్ కి బలి అయ్యాడని అమెరికా నుంచి అర్జున్ ప్రసాద్(రాణా) వస్తాడు. చివరి క్షణాల్లో ఉన్న తండ్రి ముఖ్యమంత్రి అవ్వమని మాట తీసుకుంటాడు. ఆ మాటను నిలబెట్టటానికి అర్జున్..రాజకీయమనే పద్మవ్యూహంలో ప్రవేశిస్తాడు.ఆ క్రమంలో అర్జున్ కి తండ్రే పెద్ద అవినీతిపరుడని తెలుస్తుంది. దాంతో తనైనా అవినీతిలేని సమాజాన్ని అందించి, ప్రజల రుణం తీర్చుకోవాలని కంకణం కట్టుకుంటాడు. అయితే అప్పటికే ఆ ముఖ్యమంత్రి పదివి కోసం మంతనాలు జరిగి ధనరాజ్(సుబ్బరాజు)ముందుకొస్తాడు. అతను ఎంతకైనా తెగించే మనిషని, తన తండ్రి మరణానానికి అతడే కారణమని తెలుసుకున్న అర్జున్ ముల్లును ముల్లుతోనే తీసే విధంగా అదే అవినీతి దారిలో ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత ప్రజలకు ఏం చేసాడు. అతను అనుకున్న అవినీతిలేని సమాజం సాధించాడా..అలాగే రేడియో జాకీ (హీరోయిన్) తో హీరోకి సంభంధం ఏమిటీ...అంటే సినిమా చూడాల్సిందే.