సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్ద,అమలాపాల్, అర్జున్, సురేష్, రవి రాఘవేంద్ర, సురేఖవాణి, శ్రీరంజని, శ్యామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజీ మోహన్ నిర్వహించారు మరియు నిర్మాతలు సిద్దార్థ్, కె వేణుగోపాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
అర్జున్(సిద్ధార్థ), పార్వతి(అమలపాల్) ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని మరిచి పోవడానికి తన ఫ్రెండ్స్ తో గడుపుతుంటాడు. పార్వతి పేరెంట్స్ అరవింద్(సురేష్), సరు(సురేఖవాణి)ల లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తోంది. మరి వీరి లవ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్ ఏమిటి? అర్జున్, పార్వతి లవ్.... ఫెయిల్యూర్ గానే మిగిలి పోయిందా? సక్సెస్ అయిందా? అనేది తెరపై చూడాల్సిందే.