లవ్ టుడే సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా, ఇవాన, సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
కథ
ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖితా (ఇవానా) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం అనుకోకుండా ఓరోజు నిఖితా తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్)కి తెలుస్తుంది. ప్రేమ, పెళ్లి గురించి ప్రదీప్ ను వచ్చి ఇంట్లో మాట్లాడమని చెబుతాడు నిఖితా తండ్రి. ప్రదీప్, నిఖితా ఇద్దరు తమ ముబైల్ ఫోన్స్ మార్చుకుని 24 గంటలు గడపాలని ఇద్దరూ ఊహించని షాక్ ఇస్తాడు. ఒకరి ఫోన్ తో ఒకరు ఒక రోజు గడిపిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెబితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని హామీ ఇస్తాడు. దీంతో ఆ ఒక్క రోజు ప్రదీప్, నిఖితా ఫోన్స్ మార్చుకుంటారు. అప్పటి నుంచి వాళ్ల జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి..? ఎవరి గురించి ఎలాంటి సీక్రెట్స్ తెలుసుకున్నారు..? వీళ్ల ప్రేమ నిలిచిందా..? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలంటే లవ్ టుడేను కచ్చితంగా చూడాల్సిందే.