లవర్స్ సినిమా రోమ్యాంటిక్ కామిడి చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, నందిత, షామిలి, తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్, చిట్టి, సన, తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సమర్పణ:మారుతి మరియు రచన, దర్శకత్వం:హరి నిర్వహించారు, నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంగీతం:జె బి స్వరాలు సమకుర్చారు.
కథ
చిత్ర బాల సుబ్రమణ్యం(నందిత) సిగ్నండ్ ప్రాయిడ్ భక్తురాలు....ఆమెకు మగాళ్లంటే పడదు. ఈ కాలం యూత్ సైజాలజి బాగా తెలుసు అని నమ్ముతూ, అబ్బాయిలకు ప్లర్ట్ చేయటం తప్ప...ప్రేమించటం రాదు అని బలంగా నమ్మి , వాటిని తన స్నేహితురాళ్ల ప్రేమలకు అప్లై చేస్తూ సక్సెస్ ఫుల్ గా బ్రేకప్ అప్ చేస్తూంటుంది. అలా ఆ ఓ రెండు ప్రేమ కథలకు బలైపోయిన సిద్దు(సుమంత్ అశ్విన్)ఆమే తన ప్రేమ కథలకు విలన్ అని తెలియక ఆమెను ఓ పట్టులంగాలో చూసి పీకలలోతు ప్రేమలో పడిపోతాడు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న సిద్దు ...ఆడవాళ్ళంటే మండిపడే సప్తగిరి సాయింతో తన ప్రేమ కథను ఎలా సాధించుకున్నాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.