X
తెలుగు » సినిమాలు » ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ
ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ

Biography | 30 Sep 2016 | U | 190 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ స్టోరీ

ఎం ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా భారత క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మకథతో తెరకెక్కిన చిత్రం ఇందులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రేయష్ తల్పాడే, కైరా అద్వాని, దిశా పతాని, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా, రాజేష్ శర్మ, గౌతమ్ గులాటి, హెర్రి తంగ్రి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నీరజ్ పాండే నిర్వహించారు మరియు నిర్మాత అరుణ్ పాండే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అమాల్ మాలిక్ స్వరాలు సమకుర్చరు.  కథ రాంచీలో సాధారణ పంపు ఆపరేటర్ భాన్ సింగ్. తనకు సరైన చదువు అందలేదు, సరైన ఉద్యోగం లేదు, తన పిల్లలైనా బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తనకంటే బాగా బ్రతకాలని ఆశపడే ఒక మధ్యతరగతి తండ్రి. భాన్ సింగ్ కుమారుడు మహేంద్రసింగ్ ధోనికి చిన్నతనం నుండే ఆటలంటే ఆసక్తి. ధోనీ స్కూల్ లో ఫుట్ బాల్ టీంకు గోల్ కీపర్. బంతిని క్యాచ్ చేయడంలో అతని టాలెంట్ గమనించిన స్కూల్ కోచ్ స్కూల్ క్రికెట్ టీంకు వికెట్ కీపర్ లేని లోటును పూడ్చేందుకు ధోనీని తీసుకుంటారు. చిన్నతనం నుండే ధోని వికెట్ కీపింగ్, బ్యాటింగులో మంచి ప్రతిభ చూపిస్తూ ఎదుగుతాడు. తన విభిన్నమైన ఆటతీరు, మరెవరూ ఆడలేని అసాధారణమైన షాట్లు....చూసేవారిని మంత్రముగ్ధులను చేసే బ్యాటింగ్ స్టైల్ తో లోకల్ గా బాగా ఫేమస్ అవుతాడు. ధోనీ ఆడుతుంటే చూసేందుకు గుంపులుగుంపులుగా లోకల్ ఫ్యాన్స్ తరలివస్తుంటారు. సరిగ్గా అండర్ 19 వలర్డ్ కప్ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగే సమయం.... తనకు పరీక్షల సమయం ఒకేసారి వస్తుంది. ఉదయం పూట పరీక్షలు రాస్తూ, అయిపోగానే రాంచీ నుండి పరుగు పరుగున ట్రైన్ లో జంషెడ్ పూర్ లో జరిగే సెలక్షన్స్ ట్రయల్స్ కు వెలుతూ ధోనీ ఎంత కట్టపడ్డాడో మాటల్లో చెప్పడం కంటే తెరపై చూస్తేనే బావుంటుంది. అయితే అప్పటి బీహార్ స్టేట్ క్రికెట్ సంఘంలో పాలిటిక్స్ వల్ల ధోనీ అండర్ 19 వరల్డ్ కప్ కు సెలక్ట్ కాలేకపోతాడు, తర్వాత కోల్ కతాలో జరుగుతున్న దులీప్ ట్రోపీలో ఆడే అవకాశం అభించినా....సమయానికి అక్కడికి చేరుకోలేని దుస్థితి. కట్ చేస్తే.... రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం తనను వెతుక్కుంటూ వస్తుంది. తన కొడుకు గవర్నమెంటు ఉద్యోగి అయ్యాడనే తండ్రి ముఖంలో సంతోషాన్ని చెరిపేయడం ఇష్టంలేక... పరిస్థితులకు రాజీపడి ఖరగ్‌పూర్‌లో ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరుతాడు. అటు ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, ఇటు తనకిష్టమైన క్రికెట్ ను వదిలి పెట్టలేక ధోనీ ఏం చేసాడు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇండియన్ టీంలోకి సెలక్ట్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది తెరపై చూస్తేనే సినిమా మంచి కిక్ ఇస్తుంది.
Read More

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ కాస్ట్ & క్రూ

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నీరజ్ పాండే
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అమాల్ మాలిక్
నిర్మాత అరుణ్ పాండే
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ను మతంగా అభిమానించే భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ గా, సక్సెస్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా, అంతకంటే సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, ఎలాంటి పరిస్థితులను అయినా కూల్ గా హ్యాండిల్ చేసే సారథిగా ధోని మనకు తెలుసు. ఇదంతా నాణేనికి ఒక వైపు... మనకు తెలియని ధోనీ జీవితం ఎంతో ఆసక్తికరం... ధోనీ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే....పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు....అతడు ధోనీ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి. దర్శకుడు నీరజ్ పాండే తన బాధ్యతకు పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా చిన్నతనం నుండి ధోనీ క్రికెటర్ గా ఎదుగుతున్న తరుణంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడిచేలా తెరకెక్కించి అదరగొట్టాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. కొన్ని చోట్ల సినిమా స్లో అయినట్లు అనిపించినా మళ్లీ వెంటవెంటనే సినిమా పుంజుకున్నట్లు ఉండటంతో ప్రేక్షకుల్లో ఆ ఫీలింగ్ రాదు. డైలాగ్స్ కూడా బావున్నాయి.

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+