మా ఆవారా జిందగీ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీహాన్, అజయ్, సద్దాంతో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్ట్‌లు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం దీపా శ్రీకాంత్‌రెడ్డి వహించారు. నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు.
రిలీజ్
మా ఆవారా జిందగీ సినిమా జూన్ 23న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
కథ
భట్టి ( బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్), సీబీ (ముక్కు అవినాష్ సోదరుడు జబర్దస్త్ అజయ్ ), జస్వంత్ (లంబు), చెర్రీ (ఎల్బీ) నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. బాధ్యత లేకుండా.. జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. తప్పతాగడం, అమ్మాయిలతో గడపడం చేయడమే ఎంజాయ్ అని బతుకుతుంటారు. రాత్రి పూట తాగి పోలీసులకు చిక్కుతుంటారు. తాగుడు, ఇతర వ్యసనాలు మానుకొని సరిగా ప్రవర్తించకుంటే శిక్షిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎస్పై కూతురు కిడ్నాప్ అవుతుంది. శ్రీహాన్ జల్సా బృందం ఎలాంటి వ్యవహారాలను వెలుగబెట్టారు? కిడ్నాప్ గురైన కూతురు పరిస్థితి ఏమిటి? ఎస్పై కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎస్సై కూతురు కిడ్నాప్ వెనుక శ్రీహాన్, అతడి ఫ్రెండ్స్ హస్తం ఉందా? ఎస్సై కూతురు కిడ్నాప్ కథకు క్లైమాక్స్ ఏమిటి? శ్రీహాన్ బ్యాచ్ తమ ప్రవర్తనను మార్చుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆవారా జిందగీ సినిమా.