మహానటి సినిమా అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, అనుష్క, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహించారు మరియు నిర్మాత సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.
కథ
విజయవాడలో అతి సామాన్య జీవితంలో పుట్టిన సావిత్రి (కీర్తి సురేష్) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకొంటుంది. పెదనాన్న కేవీ చౌదరీ (రాజేంద్రప్రసాద్) అండతో పెరిగి పెద్దవుతుంది. తన పెదనాన్న ప్రోత్సాహంతో తొలుత నాటక రంగం, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఎంతగానో అభిమానించే హీరో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించే స్థాయికి హీరోయిన్‌గా ఎదుగుతుంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో తనకు గాడ్ ఫాదర్‌గా మారిన జెమినీ గణేషన్ (దుల్కర్ సల్మాన్) దగ్గరవుతుంది. అప్పటికే వివాహితుడైన జెమిని ప్రేమలో పడటమే కాకుండా అతడిని సావిత్రి వివాహం కూడా చేసుకొంటుంది.
పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులను సావిత్రి ఎదుర్కొన్నారు? భర్త జెమినీ గణేషన్‌తో విబేధాలు ఎందుకు వచ్చాయి? భర్తకు దూరమైన తర్వాత సావిత్రి వ్యక్తిగత, సినీ జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏంటీ? కోమాలోకి వెళ్లిన తర్వాత ఆమె జీవితం గురించి ఎలా పరిశోధన చేశారు? చివరకు సావిత్రి జీవితం ఎలా ముగిసింది? మహానటి కథలో విజయ్ ఆంటోని (విజయ్ దేవరకొండ), మధురవాణి (సమంత) పాత్రల ప్రాధాన్యం ఏమిటనే విషయాలకు తెరమీద సమాధానమే మహానటి చిత్ర కథ.