మహత్మ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, బావన, జయప్రకాష్ రెడ్డి, ఉత్తేజ్, రామ్ జగన్, పరుచూరి వెంకటేస్వరరావు, జ్యోతి, ఆహుతి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి నిర్వహించారు మరియు నిర్మాత సి ఆర్ మనోహర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజమ్ ఆందోని స్వరాలు సమకుర్చారు.
కథ
ఓ కరుడుగట్టిన రౌడీ గాంధీ సిద్దాంతాలను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అంటూ చర్చించటం ఈ కథ ముఖ్య ఉద్దేశం. దాసు(శ్రీకాంత్) ఓ వీధి రౌడి. తన పరిధిలో సెటిల్ మెంట్స్ చేసుకుంటూ బ్రతికే అతనికి లోకల్ పొలిటీషియన్ దాదా(జయప్రకాష్ రెడ్డి) పరిచయమవుతాడు. అతన్ని గుడ్డిగా నమ్మి పనిచేసుకుంటూడగా ఓ విషయంలో దాదా నిజ స్వరూపం తెలుస్తుంది. దాంతో అతనికి దాసు ప్రత్యర్ధిగా మారి ఎమ్మల్యేగా నిలబడి ఓడించి దెబ్బ కొడదామనుకుంటాడు. ఏ పార్టీలోనూ టిక్కెట్టు దొరక్క సొంతంగా మహాత్మా పార్టీ పెడతాడు.అలాగే ఈ క్రమంలో దాసుకు కృష్ణవేణి(భావన) అనే లాయర్ పరిచయమవుతుంది. ఆమె సలహాపై తను పెట్టిన పార్టీ గుర్తు గాంధీ కావటంతో ఆ సిద్దాంతాలను అమలు చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి దాసు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు..విలన్స్ కి ఎలా బుద్ది చెప్పాడు అనేది మిగతా కథ.