మళ్లీ మొదలైంది సినిమా డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి, పోసాని కృష్ణ మురళి, సుహాసిని, పృథ్వి రాజ్, అన్నపూర్ణ, వెన్నెల కిశోర్, మంజుల, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టి జి కీర్తి కుమార్ వహించారు. నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.
కథ
విక్రమ్ (సుమంత్ కుమార్) వృత్తిరీత్యా చెఫ్. తన సహచరి ఉద్యోగిని నిషా (వర్షిణి సౌందర్‌రాజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. కానీ దాంపత్య జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకొంటారు. అయితే తన తరఫున విడాకుల కేసును వాదించిన లాయర్ పవిత్ర అలియాస్ పవ్వి (నైనా గంగూలీ)తో ప్రేమలో పడుతారు. ఏడాదిపాటు సహజీనం చేసుకొన్న తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఈ క్రమంలో పవ్వికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. విక్రమ్ (సుమంత్ కుమార్) వృత్తిరీత్యా చెఫ్. తన సహచరి ఉద్యోగిని నిషా (వర్షిణి సౌందర్‌రాజన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. కానీ దాంపత్య జీవితంలో అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకొంటారు. అయితే తన తరఫున విడాకుల కేసును వాదించిన లాయర్ పవిత్ర అలియాస్ పవ్వి (నైనా గంగూలీ)తో ప్రేమలో పడుతారు. ఏడాదిపాటు సహజీనం చేసుకొన్న తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఈ క్రమంలో పవ్వికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. భార్య నిషాతో విక్రమ్ ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? తాను అమితంగా ఇష్టపడే నిషాను ఏ పరిస్థితుల్లో వదులుకొన్నాడు? లాయర్ పవిత్రతో ఎలా? ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఏడాదిపాటు సహజీవనం చేసిన తర్వాత ఎందుకు విడిపోవాలనుకొన్నాడు? విక్రమ్ జీవితంలో స్నేహితురాలు వైష్ణవి (పావని రెడ్డి) పాత్ర ఏమిటి? రెండుస్లారు బ్రేకప్ చోటుచేసుకోవడంతో విక్రమ్ పరిస్థితి ఏమైంది. చివరకు విక్రమ్ జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే మళ్లీ మొదలైంది సినిమా కథ.