మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, మనోచిత్ర, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంకట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం : ఉదయ్‌రాజ్ నిర్వహించారు, నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు రాం స్వరాలు సమకుర్చారు.
కథ
'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'కి యజమాని మనీ మైండెడ్ మ్యారేజ్ బ్రోకర్ మల్లిగాడు(శ్రీకాంత్). డబ్బు లిస్తే ఎలాంటి సంబంధాలైనా సెట్ చేస్తాడు. తాను చేసే పెళ్లిళ్లకి ఒక సంవత్సరం గ్యారంటీ కూడా ఇస్తుంటాడు. ఇలా డబ్బులు తీసుకుని కొందరికి పెళ్లి సంబంధాలు సెట్ చేస్తానని మాటిస్తాడు. మాట నిలబెట్టుకునే క్రమంలో ఇబ్బందులో పడతాడు. మరి మల్లిగాడు ఆ ఇబ్బందుల నుండి ఎలా బయట పడ్డాడు? అనేది ఫైనల్ స్టోరీ.