మల్లీశ్వరి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, కత్రిన కైఫ్, కోట శ్రీనివాస రావు, నరేష్, సనా, బ్రహ్మనందం, సునిల్, మల్లికార్జున రావు, చలపతి రావు, తనికెళ్ల భరణి, చిత్రం శ్రీను, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విజయ భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
కథ
మీర్జాపురం యువరాణి మల్లీశ్వరి (కత్రిన కైఫ్) తన తండ్రి ఆస్థి మొత్తం 750 కోట్లు విలువ చేసేది తనకు 21 సంత్సరాలు పూర్తి అయితే తనకు చేందేటట్లు ఉంటుంది. ఆస్థి కోసం భవాణి ప్రసాద్ (కొటా శ్రీనివాస రావు) మల్లీశ్వరి ని చంపాలని తన రౌడీల ద్వరా ప్రయత్నిస్తుంటారు. మల్లీశ్వరి ని అక్కడ నుండి వైజాగ్ లో వున్న తన మామ (తనికెళ్ల భరణి) దగ్గరకు కోద్ద రోజులు పంపుతారు. ప్రసాద్ (వెంకటేష్) వైజాగ్ లో బ్యాంక్ అకౌంటేడ్ గా పనిచేస్తుంటారు..అతను గత 7 సంత్సరాలు నుంచి పెళ్ళిచేకోవాలని ప్రయత్నాలు జరుగుతుంటాయు గాని ఏ ఒక్కటి సరిపోదు..అక్కడ అందరు పెళ్ళికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. ప్రసాద్ మల్లీశ్వరిని చూసి ప్రేమలోపడతాడు..ఆమే ప్రేమకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు..అందులో భాగంగానే తనుకు తేలియకుండా మల్లీశ్వరిని చంపాడానికి వచ్చిన రౌడీల నుండి కాపాడుతాడు. ప్రసాద్ అప్పుడు మల్లిశ్వరి గతం గురించి తేసుకోని ఆమే ఆస్థి కోసం ప్రయత్నిస్తున్న రౌడీల నుండి ఎలా కాపాడుతాడు అలాగే మల్లీశ్వరిని పెళ్ళి ఎలా చేసుకుంటాడు అనేది మిగతా కథా..