మన ఊరి రామాయణం సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన డ్రామ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృద్వి, రఘు బాబు తదితరులు నటించారు. ఈ సినిమాని ప్రకాష్ రాజ్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.
కథ
దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించి, తన ఊరిలో స్థిరపడిన వ్యక్తి భుజంగరావు(ప్రకాశ్ రాజ్). పరువు కోసం ఏమైనా చేస్తాడు. భుజంగంపెద్ద కూతురికి బాగా చదువుకోవాలని ఉంటుంది. అయితే భుజంగం అనుమానంతో, పెద్ద కూతురుకి డిగ్రీ పూర్తి కాకముందే పెళ్లి చేసేయాలనుకుంటాడు. ఆటో నడుపుకునే శివ(సత్యదేవ్)కు దుబాయ్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకని భుజంగంను పాస్‌పోర్ట్ ఇప్పించమని అడుగుతాడు. భుజంగం శివకు పాస్‌పోర్ట్ ఇప్పిస్తానని మాటలు చెబుతాడు కానీ పాస్‌పోర్ట్ ఇప్పించకుండా.., శివను తన స్వంత పనులకు వాడుకుంటూ ఉంటాడు. భుజంగానికి తన ఇంటి పక్కనే ఓ ఖాళీ షాప్ ఉంటుంది. ఆ షాప్‌లోనే తన మిత్రులతో ఎప్పుడూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి భుజంగం తన మందు కొట్టి ఇంటికి వెళుతూ దారిలో ఓ వేశ్య(ప్రియమణి)ని చూస్తాడు. ఆమెతో ఓ రాత్రి ఎంజాయ్ చేయాలనుకుని శివ సాయంతో ఆమెతో బేరం కుదుర్చుకుంటాడు. వేశ్యతో బయటెక్కడైనా కనపడితే సమాజంలో తన పరువు పోతుందని భావించి, అమ్మాయితో తన ఖాళీ షాప్‌లోకే వెళతాడు. శివ (సత్య) వారిద్దరిని షాపులో వుంచి, తాళం వేసి, గంటలో వస్తానని వెళ్తాడు. వేశ్యని తీసుకొచ్చాడే గానీ.. భుజంగానికి లోలోపల భయం. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఒణికిపోతుంటాడు. అలాగని బయటకు పంపేద్దామంటే తాళం వేసి ఉంటుంది. గంటలో వస్తానన్న సత్య ఎంతకీ రాడు. దాంతో ఆ షాపులో రెండు రోజులు అలా వుండిపోవాల్సి వస్తుంది. మరి చివరికి ఏమైంది? వాళ్లిద్దరూ బయట పడ్డారా, లేదా? శివ ఎక్కడ ఉండిపోయాడు? తనకి ఎదురైన సినిమా దర్శకుడు (ఫృథ్వీ) కథేంటి?? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. మన ఊరి రామాయణం చూడాల్సిందే.