X
తెలుగు » సినిమాలు » మన ఊరి రామాయణం
మన ఊరి రామాయణం

మన ఊరి రామాయణం

Thriller | 07 Oct 2016 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మన ఊరి రామాయణం స్టోరీ

మన ఊరి రామాయణం సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన డ్రామ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృద్వి, రఘు బాబు తదితరులు నటించారు. ఈ సినిమాని ప్రకాష్ రాజ్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.  కథ దుబాయ్ లో బాగా డబ్బు సంపాదించి, తన ఊరిలో స్థిరపడిన వ్యక్తి భుజంగరావు(ప్రకాశ్ రాజ్). పరువు కోసం ఏమైనా చేస్తాడు. భుజంగంపెద్ద కూతురికి బాగా చదువుకోవాలని ఉంటుంది. అయితే భుజంగం అనుమానంతో, పెద్ద కూతురుకి డిగ్రీ పూర్తి కాకముందే పెళ్లి చేసేయాలనుకుంటాడు. ఆటో నడుపుకునే శివ(సత్యదేవ్‌)కు దుబాయ్‌ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకని భుజంగంను పాస్‌పోర్ట్‌ ఇప్పించమని అడుగుతాడు. భుజంగం శివకు పాస్‌పోర్ట్‌ ఇప్పిస్తానని మాటలు చెబుతాడు కానీ పాస్‌పోర్ట్‌ ఇప్పించకుండా.., శివను తన స్వంత పనులకు వాడుకుంటూ ఉంటాడు. భుజంగానికి తన ఇంటి పక్కనే ఓ ఖాళీ షాప్ ఉంటుంది. ఆ షాప్‌లోనే తన మిత్రులతో ఎప్పుడూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రాత్రి భుజంగం తన మందు కొట్టి ఇంటికి వెళుతూ దారిలో ఓ వేశ్య(ప్రియమణి)ని చూస్తాడు. ఆమెతో ఓ రాత్రి ఎంజాయ్‌ చేయాలనుకుని శివ సాయంతో ఆమెతో బేరం కుదుర్చుకుంటాడు. వేశ్యతో బయటెక్కడైనా కనపడితే సమాజంలో తన పరువు పోతుందని భావించి, అమ్మాయితో తన ఖాళీ షాప్‌లోకే వెళతాడు. శివ (సత్య) వారిద్దరిని షాపులో వుంచి, తాళం వేసి, గంటలో వస్తానని వెళ్తాడు. వేశ్య‌ని తీసుకొచ్చాడే గానీ.. భుజంగానికి లోలోప‌ల భ‌యం. బ‌య‌ట‌కు తెలిస్తే ప‌రువు పోతుంద‌ని ఒణికిపోతుంటాడు. అలాగ‌ని బ‌య‌ట‌కు పంపేద్దామంటే తాళం వేసి ఉంటుంది. గంట‌లో వ‌స్తానన్న స‌త్య ఎంత‌కీ రాడు. దాంతో ఆ షాపులో రెండు రోజులు అలా వుండిపోవాల్సి వస్తుంది. మ‌రి చివ‌రికి ఏమైంది? వాళ్లిద్ద‌రూ బ‌య‌ట ప‌డ్డారా, లేదా? శివ ఎక్క‌డ ఉండిపోయాడు? త‌నకి ఎదురైన సినిమా ద‌ర్శ‌కుడు (ఫృథ్వీ) క‌థేంటి?? ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే.. మ‌న ఊరి రామాయ‌ణం చూడాల్సిందే.
Read More

మన ఊరి రామాయణం కాస్ట్ & క్రూ

మన ఊరి రామాయణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రకాష్ రాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత ప్రకాష్ రాజ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మన ఊరి రామాయణం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పరువూ పరువూ అంటూ తిరిగే ఒక ఊరి పెద్దమనిషి, పాతకాలం సాంప్రదాయాలని పాటించాలనీ, ఆడవాళ్ళంటే తక్కువ అభిప్రాయం ఉన్న ఒక మనిషి తాత్కాలిక సుఖం కోసం త‌ప్పు చేయాల‌ని అనుకొని, అది త‌ప్పు అని తెలుసుకొని, అందులోంచి బ‌య‌ప ప‌డ‌డానికి అతనుప‌డిన పాట్లు, ఆ క్రమంలో తనకి తాను కొన్ని సత్యాలని తెలుసుకొనే క్రమం లో పుట్టిందే ఈ మన ఊరి రామాయణం క‌థ‌. చిన్న పాయింట్ కి కాస్త వినోదం, థ్రిల్లింగ్ అంశాలు జోడించి చివ‌రికి హార్ట్ ట‌చింగ్ ఫినిష్ తో మనల్ని కట్టి పడేసే సినిమా గా మార్చటం లో పూర్తి సక్సెస్ అయ్యాడు ద్ఫర్శకుడు. ఇది మళయాల రీమేక్ అయినా ఎక్కడా ఆ చాయలు కనిపించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఇక వినోదం కోసం ఫృద్వీ చేసిన "గ‌రుడ‌" క్యారెక్ట‌ర్ క‌థ‌లో ఉంటూనే వినోదం పండిస్తుంటుంది. డైలాగుల్లో పంచ్ లేక‌పోయినా, ఆయా సంభాషణలని నిజాయితీగా మలిచటం తో పాటు వాటిని పలికిన ఫృద్వీ స్టైల్ క‌ల‌సి ఆయా సంభాష‌ణ‌ల్ని పండించాయి.

మన ఊరి రామాయణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మన ఊరి రామాయణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+