మర్యాద రామన్న సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, సలోనీ, నాగినీడు, బ్రహ్మాజి, రావు రమేష్, సుప్రీత్, వేణు గోపాల్, ప్రభాకర్, కాంచి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
హైదరాబాద్ లో నానా కష్టాలుపడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న అనాధ రాము(సునీల్). అతనికి ఆశాకిరణంలా ఓ రోజు చిన్నప్పుడే వదిలేసిన తన సొంత ప్రాతం రాయలసీమ నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారసత్వపు పొలాన్ని స్వాధీనం చేసుకోమని ఆ లెటర్ లో ఉంటుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాము ఆ ఊరుకి గాల్లో తేలుకుంటూ బయిలుదేరతాడు. రాముకి ప్రయాణంలో అపర్ణ(సలోని)అనే అందాల అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ఓ పాట పాడుకుని తన ఊరు వెళ్ళిన రాముకి ఆ ఊరి పెద్ద రామనీడు(నాగినీడు)ఆతిధ్యమిస్తాడు.ఆ క్రమంలో వాళ్ళతో వారి ఇంటకి వెల్ళిన రాముకి రామనీడు తను ఇష్టపడ్డ అమ్మాయి అపర్ణ తండ్రి అని తెలిస్తుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవకుండా వెంటనే మరో విషయం బయిటపడుతుంది. అది వేరేదో కాదు..రామనీడు చిరకాల ప్రత్యర్ధి కొడుకే రాము. ఇది తెలిసిన వెంటనే రామనీడు, అతని కొడుకులు వెంటనే రాముని చంపేయాలనుకుంటారు. అయితే తమ ఆచారం ప్రకారం ఇంటిలో చంపకూడదని,గుమ్మం దాటి బయిటకు అడుగుపెట్టిన వెంటనే చంపేయాలని రెడీ అవుతారు. విషయం తెలుసుకున్న రాము ఇల్లు గుమ్మం దాటి బయిటకు వెళ్ల కూడదనుకుని నిర్ణయించుకుంటాడు. ఈ విపత్కర పరిస్ధితుల్లో ఇరుకున్న రాము అక్కడనుంచి ఎలా బయిటపడి తన ప్రాణాలు కాపాడుకుని,తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది మిగతా కథ.