X
తెలుగు » సినిమాలు » మర్యాద రామన్న
మర్యాద రామన్న

మర్యాద రామన్న

Action | Comedy | 23 Jul 2010 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మర్యాద రామన్న స్టోరీ

మర్యాద రామన్న సినిమా యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్, సలోనీ , నాగినీడు, బ్రహ్మాజి, రావు రమేష్, సుప్రీత్, వేణు గోపాల్, ప్రభాకర్, కాంచి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ హైదరాబాద్ లో నానా కష్టాలుపడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న అనాధ రాము(సునీల్). అతనికి ఆశాకిరణంలా ఓ రోజు చిన్నప్పుడే వదిలేసిన తన సొంత ప్రాతం రాయలసీమ నుంచి ఓ ఉత్తరం వస్తుంది. ఆ గ్రామంలో ఉన్న వారసత్వపు పొలాన్ని స్వాధీనం చేసుకోమని ఆ లెటర్ లో ఉంటుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాము ఆ ఊరుకి గాల్లో తేలుకుంటూ బయిలుదేరతాడు. రాముకి ప్రయాణంలో అపర్ణ(సలోని)అనే అందాల అమ్మాయి పరిచయమవుతుంది. ఆమెతో ఓ పాట పాడుకుని తన ఊరు వెళ్ళిన రాముకి ఆ ఊరి పెద్ద రామనీడు(నాగినీడు)ఆతిధ్యమిస్తాడు.ఆ క్రమంలో వాళ్ళతో వారి ఇంటకి వెల్ళిన రాముకి రామనీడు తను ఇష్టపడ్డ అమ్మాయి అపర్ణ తండ్రి అని తెలిస్తుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవకుండా వెంటనే మరో విషయం బయిటపడుతుంది. అది వేరేదో కాదు..రామనీడు చిరకాల ప్రత్యర్ధి కొడుకే రాము. ఇది తెలిసిన వెంటనే రామనీడు, అతని కొడుకులు వెంటనే రాముని చంపేయాలనుకుంటారు. అయితే తమ ఆచారం ప్రకారం ఇంటిలో చంపకూడదని,గుమ్మం దాటి బయిటకు అడుగుపెట్టిన వెంటనే చంపేయాలని రెడీ అవుతారు. విషయం తెలుసుకున్న రాము ఇల్లు గుమ్మం దాటి బయిటకు వెళ్ల కూడదనుకుని నిర్ణయించుకుంటాడు. ఈ విపత్కర పరిస్ధితుల్లో ఇరుకున్న రాము అక్కడనుంచి ఎలా బయిటపడి తన ప్రాణాలు కాపాడుకుని,తను ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది మిగతా కథ.
Read More

మర్యాద రామన్న కాస్ట్ & క్రూ

మర్యాద రామన్న సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత సొభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మర్యాద రామన్న విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యాక్షన్ చిత్రాల రాజమౌళి ట్రెండ్ మార్చి ఫుల్ లెంగ్త్ కామిడీ తీస్తున్నాట్ట...అదీ సునీల్ ని హీరోగా పెట్టి..ఎలా ఉంటుందో ఏంటో అంటూ గత కొద్ది రోజులుగా ఎక్కడికి వెళ్ళినా ఇది వినపడుతోంది. ఆ టాక్ కి తగ్గట్లుగానే మంచి ఓపినింగ్స్ కూడా మర్యాదరామన్నకి వచ్చాయి. కానీ సినిమాలో ఊహించనంత కామిడీ మాత్రం కరువవటం నిరాశపరిచింది. అయితే ఈ సినిమాకి సంభందించి ఇక్కడో గొప్ప విషయం మాట్లాడుకోవాలి. తెలుగులో కామిడీ సినిమా అనగానే తెరనిండా కామిడీ యాక్టర్లు, రకరకాల సబ్ ప్లాట్లుతో కామిడీ పండించే ప్రయత్నాలు కామన్. అయితే మర్యాదరామన్న తన మర్యాదను పోగొట్టుకోకుండా సినిమా ప్రారంభంలో ఎత్తుకున్న పాయింట్ ప్రక్కకు పోనివ్వకుండా,తెరనిండా కామిడీ నటులును నింపకుండా తెలుగు కామిడీ చిత్రాన్ని రూపొందించారు. ఇక 1923లో వచ్చిన బస్టర్ కీటన్ సైలెంట్ కామిడీ అవర్ హాస్పటిలాటి చిత్రం కథని ఈ కాలానికి ముఖ్యంగా ఫ్యాక్షన్ వాతావరణంలోకి మార్చి కథనం తయారుచేసుకున్న ఈ చిత్రం స్క్రిప్టు లోపమే సెకండాప్ ని డల్ చేసిందనిపిస్తుంది. అయితే హింస, అసభ్యత లేని ఈ చిత్రం, రాజమౌళి ట్రేడ్ మార్క్ తో ప్యామిలీలను రప్పిచే ప్రయత్నం చేస్తుంది. ఇక సునీల్ స్లిమ్ గా మారటమే కాక తనకు అలవాటైన హావభావాలను ప్రక్కన పెట్టి కొత్తగా ట్రై చేసాడు. అయితే సునీల్ ఇంతకు ముందులాగే బొద్దుగా ఉంటేనే చూడగానే నవ్వు వచ్చేదేమో ఒక్కోసారి అనిపించటం ఖాయం.

మర్యాద రామన్న సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మర్యాద రామన్న

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+